శ్రియ ప్రెగ్నెన్సీని దాచడంపై స్పందించిన మంచు లక్ష్మి | Manchu Lakshmi Comments On Shriya Pregnancy Secret On Social Media | Sakshi
Sakshi News home page

Manchu Lakshmi: శ్రియ ప్రెగ్నెన్సీని దాచడంపై స్పందించిన మంచు లక్ష్మి

Published Thu, Oct 14 2021 8:10 AM | Last Updated on Thu, Oct 14 2021 12:37 PM

Manchu Lakshmi Comments On Shriya Pregnancy Secret On Social Media - Sakshi

Manchu Lakshmi Comments On Shriya Saran Pregnancy: హీరోయిన్‌ శ్రియ సరన్‌ గతేడాది తనకు బిడ్డ పుట్టిందని ప్రకటించి ఒక్కసారిగా అందరికి షాక్‌ ఇచ్చింది. తొమ్మిది నెలల క్రితం తనకు ఆడపిల్ల పుట్టిందని, తన పేరు రాధ అని శ్రియ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రియ తల్లైన విషయం తెలిసి అందరూ సంతోషించినప్పటికి.. జీవితంలో అత్యంత ముఖ్యమైన, ఆనందకరమైన విషయాన్ని ఇలా రహస్యంగా ఉంచడంపై ఫ్యాన్స్‌ కాస్తా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే శ్రియ ప్రెగ్నెన్సీని దాచడంపై మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న కూడా స్పందించింది. 

చదవండి: కూతురు పేరు చెప్పేసిన హీరోయిన్‌ శ్రియా సరన్‌

శ్రియ పోస్ట్‌కు ఆమె రీట్వీట్‌ చేస్తూ.. ఇది ఎప్పటికి గొప్ప శుభవార్త అంటూ శుభాకాంక్షలు తెలిపింది. ‘శుభవార్త చెప్పావు శ్రియ. ఆనందకరమైన మాతృత్వాన్ని అనుభవించాలని కోరుకుంటున్నా. ఆడ బిడ్డకు జన్మనివ్వడం ఈ ప్రపంచంలోనే అతి గొప్ప విషయం. నీకు దేవుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ఈ విషయాన్ని ప్రపంచానికి ప్రకటించడంలో నువ్వు తీసుకున్న సమయం విషయంలో నిన్ను చూసి గర్వపడుతున్నా. ఎందుకంటే ప్రెగ్నెన్సీ, పిల్లలు అనేది నీ వ్యక్తిగత విషయం’ అని పేర్కొంది. కాగా 2018లో రష్యన్‌ క్రీడాకారుడు, బిజినెస్‌ మ్యాన్‌ ఆండ్రీ కోషీవ్‌ను సీక్రెట్‌గా పెళ్లాడిన శ్రియ.. ఈ విషయాన్ని కూడా చాలా కాలం దాచిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement