
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప-2 ది రూల్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పటికే బాహుబలి, బాహుహలి-2, కేజీఎఫ్ లాంటి సినిమాల రికార్డులను తుడిచిపెట్టేసింది. అమిర్ ఖాన్ నటించిన దంగల్ రికార్డ్‌పై కన్నేసిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.
ఈ నేపథ్యంలో పుష్ప-2 ఓటీటీకి సంబంధించి ఈ రోజు పెద్దఎత్తున వార్తలొస్తున్నాయి. దీనికి కారణం నెట్‌ఫ్లిక్స్‌లో పుష్ప-2 రీ లోడెడ్ వర్షన్ కమింగ్ ఆన్ థర్స్‌డే అనే పోస్టర్ కనిపించింది. దీంతో ఈ వారంలోనే పుష్ప-2 ఓటీటీకి రానుందని అంతా ఫిక్సయిపోయారు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఆడియన్స్‌ను బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. అదేంటో చూసేద్దాం.
ఉదయం నుంచి పుష్ప-2 ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అంతా రాసుకొచ్చారు. కానీ తాజాగా నెట్‌ఫ్లిక్స్ ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టింది. పుష్ప-2 మూవీ త్వరలోనే ఓటీటీకి రానుందని ప్రకటించింది. అయితే స్ట్రీమింగ్ తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇవాళ నెట్‌ఫ్లిక్స్‌లో గురువారం అని ఇచ్చారు కానీ.. ఈ వారంలోనా.. లేదంటే వచ్చేవారంలోనా అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో ఆడియన్స్‌లో కన్‌ఫ్యూజన్‌కు తెరదించేందుకు నెట్‌ఫ్లిక్స్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. మరీ ఈ వారంలోనే ఓటీటీకి వస్తుందా? ఫిబ్రవరి 6న రానుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఫిబ్రవరి 6 నుంచే ఛాన్స్..
పుష్ప-2 చిత్రం రిలీజైన ఫిబ్రవరి 6వ తేదీకి రెండు నెలలు పూర్తవుతుంది. ముందుగా చేసుకున్న డీల్ ప్రకారం 56 రోజుల తర్వాతే ఓటీటీకి రావాలి. ఈ లెక్కన చూస్తే ఈ వారంలో ఓటీటీకి వచ్చే ఛాన్స్ లేదు. నెట్‌ఫ్లిక్స్ చేసిన పొరపాటుకు ఆడియన్స్ ఈ వారంలోనే వస్తుందని ఫిక్స్ అయిపోయారు. మరి పుష్పరాజ్ ఈ నెలలోనే ఓటీటీలో సందడి చేస్తాడా? లేదంటే ఫిబ్రవరిలోనా అనేది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.
బాక్సాఫీస్ వద్ద జోరు..
పుష్ప 2 చిత్రం కేవలం 30 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,850 కోట్లు గ్రాస్ పైగా కలెక్షన్లు సాధించింది. ఆపై బాహుబలి2 రికార్డ్స్‌ను దాటేసింది. కేవలం హిందీలో రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. హిందీ నెట్ వసూళ్లలో తొలిసారి ఈ మార్క్ చేరిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ మూవీ కూడా సాధించలేని రికార్డ్స్ పుష్ప2 క్రియేట్ చేసింది.
సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా 2024 డిసెంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్,రష్మిక మందన్నా జోడీగా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటించారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు.
The man. The myth. The brAAnd 🔥 Pushpa’s rule is about to begin! 👊
Watch Pushpa 2- Reloaded Version with 23 minutes of extra footage on Netflix, coming soon in Telugu, Tamil, Malayalam & Kannada! pic.twitter.com/ZA1tUvNjAp— Netflix India (@NetflixIndia) January 27, 2025