'పుష్ప 2' ఓటీటీ హక్కులు.. ఏకంగా వందల కోట్లు? | Allu Arjun Pushpa 2 OTT Rights Cost Details | Sakshi
Sakshi News home page

Pushpa 2 OTT: 'పుష్ప 2' ఓటీటీ రేటు.. యమ హాటు!

Published Sat, Aug 31 2024 8:56 PM | Last Updated on Sat, Aug 31 2024 9:19 PM

Allu Arjun Pushpa 2 OTT Rights Cost Details

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2'తో బిజీగా ఉన్నాడు. షూటింగ్ చివరి దశలో ఉంది. మొన్నీమధ్య నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ప్లానింగ్ అంతా చెప్పారు. సెప్టెంబరు-అక్టోబరు కల్లా మరో రెండు పాటలు రిలీజ్ అవుతాయని, అలానే ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తవుతుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు 6న థియేటర్లలో రిలీజ్ పక్కా అని బల్లగుద్ది మరీ క్లారిటీ ఇచ్చారు.

(ఇదీ చదవండి: అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్)

ఇదలా ఉండగానే పుష్ప 2 మూవీ ఓటీటీ హక్కుల గురించి ఇప్పుడు అదిరిపోయే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఏ ఇండియన్ మూవీకి లేనంతగా అమ్మారట. ఏకంగా రూ.270 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ డిజిటల్ రైట్స్ దక్కించుకుందట. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.

మరో రెండురోజుల్లో 'పుష్ప 2' కొత్త షెడ్యూల్ మొదలవబోతుందట. ఇందులో భాగంగా అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తోంది. మరోవైపు 'పుష్ప' పార్ట్ 3 కూడా ఉండొచ్చని మొన్నీమధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రావు రమేశ్ చెప్పుకొచ్చారు. రెండో భాగాన్నే దాదాపు మూడేళ్ల నుంచి తీస్తున్నారు. ఇక మూడో పార్ట్ అంటే అది ఎన్నేళ్లు అవుతుందో?

(ఇదీ చదవండి: ఆరేళ్లు తీసిన క్రేజీ హారర్ సినిమా.. థియేటర్లలో రీ రిలీజ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement