రీ రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం చాలా ఫేమస్. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా ప్రతిచోటా ఒకప్పటి హిట్ సినిమాల్ని మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఇప్పటికే చూశాం కదా అని అనుకోకుండా బిగ్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ టైంలో మురారి, ఇంద్ర, మాస్.. ఇలా ఓ రేంజులో అలరించాయి. ఇప్పటివరకు అన్నీ మాస్ మూవీస్ వచ్చాయి కానీ ఈ ట్రెండ్‌లోనే తొలిసారి ఓ హారర్ మూవీ రిలీజ్ కాబోతుంది.
(ఇదీ చదవండి: అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్)
హారర్ జానర్‌లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ అంటే చాలామంది చెప్పే పేరు 'తుంబాడ్'. రెగ్యులర్ హారర్ టైపు స్టోరీ కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. అయితే నిర్మాతలకు డబ్బుల్లేక 2012 నుంచి దాదాపు ఆరేళ్ల పాటు విడతల వారీగా షూటింగ్ చేశారు. ఫైనల్‌గా 2018లో థియేటర్లలో రిలీజ్ చేస్తే ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఓటీటీలో అది కూడా లాక్ డౌన్‌లో ఈ సినిమాని తెగ చూశారు. ఇప్పుడు దీన్నే సెప్టెంబరు 13న మళ్లీ దేశంలో పలుచోట్ల రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
'తుంబాడ్' విషయానికి వస్తే.. 1918లో మహారాష్ట్రలోని కలమేడ్ గ్రామం. వినాయక్ రావు (సోహం షా) తన తల్లి, సోదరుడితో కలిసి నివసిస్తుంటాడు. ఊరి గుడిలో నిధి దాగి ఉందన్న వార్త విని, దాని కోసం వెతుకుతుంటాడు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అత్యాశ అనే స్టోరీ లైన్‌తో తీసిన ఈ మూవీలో ఊహించని హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ అందిస్తాయి. థియేటర్లలో మంచి ఎక్స్‌పీరియెన్స్ కావాలనుకుంటే ఈ మూవీ మాత్రం అస్సలు మిస్సవ్వొద్దు.
(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్ కూతురికి విచిత్రమైన కష్టాలు)
Comments
Please login to add a commentAdd a comment