అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్ | Jr NTR Fulfill Mother Shalini Wish With Prashanth Neel And Rishab Shetty | Sakshi
Sakshi News home page

NTR: ఉడుపిలో ఎన్టీఆర్ ఫ్యామిలీ.. స్పెషల్ ఏంటంటే?

Published Sat, Aug 31 2024 4:40 PM | Last Updated on Sat, Aug 31 2024 5:04 PM

Jr NTR Fulfill Mother Shalini Wish With Prashanth Neel And Rishab Shetty

జూ.ఎన్టీఆర్ మళ్లీ చాలారోజుల తర్వాత కుటుంబం గురించి పోస్ట్ పెట్టాడు. ఎప్పటిలా భార్య గురించి కాకుండా తల్లి గురించి, ఆమెకు ఎప్పటినుంచో ఉన్న కోరిక గురించి చెప్పాడు. ఇదే పోస్టులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, 'కాంతార' హీరో రిషభ్ శెట్టి గురించి ప్రస్తావించాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ తల్లి పేరు శాలిని. ఆమెది కర్ణాటకలోని కుందపుర అనే ఊరు. గతంలో పలు సందర్భాల్లో తారక్ ఈ విషయాన్ని చెప్పాడు. అయితే కొడుకుని తన సొంతూరికి తీసుకెళ్లాలని ఎప్పటినుంచో ఈమె అనుకుంటోందట. తాజాగా ఈ విషయాన్ని ఎన్టీఆర్ బయటపెట్టాడు. ఇన్ స్టాలో క్యూట్ పోస్ట్ పెట్టాడు.

(ఇదీ చదవండి: షాకింగ్ ఆరోపణలు.. నిజం కాదని తేల్చిన నటి రేవతి)

'తన సొంతూరు కుందపురకి నన్ను తీసుకొచ్చి, ఉడుపిలోని శ్రీకృష్ణ మఠం దర్శనం చేయించాలనేది మా అమ్మకు చిరకాల కోరిక. అది ఇన్నాళ్లకు నెరవేరింది. ఆమె కల నిజమైంది. సెప్టెంబరు 2న అమ్మ పుట్టినరోజు. ఆమె కోరికని నిజం చేయడం ఆమెకి ఇచ్చే పెద్ద గిఫ్ట్. దీన్ని సాధ్యమయ్యేలా చేసిన మై డియర్ ఫ్రెండ్ ప్రశాంత్ నీల్, విజయ్ కిరగందూర్‌కి థ్యాంక్యూ. అలానే రిషభ్ శెట్టికి స్పెషల్ థ్యాంక్స్. అతడి మాతో పాటు వచ్చి దీన్ని మరింత ప్రత్యేకం చేశాడు' అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్ కూడా శ్రీ కృష్ణుడి మఠం దర్శనం చేసుకున్న 'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టిది కూడా కుందపుర ఊరే. గతంలో ఇదే విషయాన్ని చెప్పాడు. అలానే తాను ఎన్టీఆర్‌కి పెద్ద ఫ్యాన్ అని కూడా అన్నాడు. ఇకపోతే తారక్ ప్రస్తుతం 'దేవర' చేస్తున్నాడు. ఇది సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా చేస్తాడు. ఈ డిసెంబరు నుంచి షూటింగ్ మొదలవుతుంది.

(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్ కూతురికి విచిత్రమైన కష్టాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement