Hero Nikhil Siddhartha Fires on Bollywood Actress Richa Chadha - Sakshi
Sakshi News home page

Nikhil Siddhartha: ఆ తర్వాతే ఏదైనా.. బాలీవుడ్ నటిపై హీరో నిఖిల్‌ ఆగ్రహం

Published Fri, Nov 25 2022 12:30 PM | Last Updated on Fri, Nov 25 2022 12:51 PM

Young Hero Nikhil Siddhartha Fire On Bollywood Actress Richa Chadha - Sakshi

బాలీవుడ్ నటి చేసిన ట్వీట్‌పై విమర్శల వర్షం కొనసాగుతోంది. ఇప్పటికే ఆమెపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేయగా తాజాగా యంగ్ నిఖిల్ సైతం మండిపడ్డారు. ఇండియన్ ఆర్మీని కించపరుస్తూ.. 'గల్వాన్‌ హాయ్‌ చెబుతోంది' అంటూ రిచా చేసిన ట్వీట్‌ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె ట్వీట్‌ని తప్పుబడుతూ మంచు విష్ణు, అక్షయ్‌కుమార్‌తోపాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నిఖిల్ ట్వీట్‌లో రాస్తూ.. ' 20 మంది భారత సైనికులు గాల్వాన్ వద్ద తమ ప్రాణాలను అర్పించారు. దేశాన్ని, మన ప్రాణాలను రక్షించారు. వారి త్యాగం గురించి వింటే ఇప్పటికీ మనకు కన్నీళ్లు వస్తాయి. రాజకీయాలను మరచి.. మన సైన్యం, సాయుధ దళాలను మనం ఎల్లప్పుడూ గౌరవించాలి. వారిని అవమానించకూడదు. రిచా దయచేసి దేశం తర్వాతే ఏదైనా తెలుసుకోండి.' అంటూ ట్వీట్ చేశారు. నెటిజన్లు సైతం ఆమె తీరును తప్పుబడుతున్నారు. ఆమెకు బుద్ధి లేదంటూ మండిపడుతున్నారు 

అసలు వివాదం ఎందుకంటే..: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని(పీవోకే) కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఆదేశానికైనా సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వారికి సరైన సమాధానం ఇస్తాం’ అంటూ నార్తర్న్‌ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది అన్నట్లు ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. దీనిపై రిచా స్పందిస్తూ 'గల్వాన్‌ హాయ్‌ చెబుతోంది' అంటూ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌పై తీవ్రమైన విమర్శలు రావడంతో ఆమె క్షమాణపలు కూడా చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement