'మహిళల జీవితాల గురించి మీకేం తెలుసు?'.. హీరామండి హీరోయిన్‌ ఫైర్ | Richa Chadha Asks Bollywood Film Makers About Women Roles | Sakshi
Sakshi News home page

Richa Chadha: మహిళల జీవితాలను చెడుగా ఎలా చూపిస్తారు?: రిచా చద్దా

Jan 28 2025 8:03 PM | Updated on Jan 28 2025 8:20 PM

Richa Chadha Asks Bollywood Film Makers About Women Roles

బాలీవుడ్ భామ రిచా చద్దా చివరిసారిగా హీరామండి వెబ్‌ సిరీస్‌లో కనిపించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్‌ ఆడియన్స్‌ నుంచి ఆదరణ దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్‌లో మనీషా కొయిరాలా కీలక పాత్రలో కనిపించింది. ఇందులో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు నటించడం విశేషం.

అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి రిచా చద్దా ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, నైట్‌క్లబ్‌లకు వెళ్లే వారిని ప్రగతిశీల మహిళలుగా చూపిస్తున్నారని ఆరోపించారు. తెరపై చూపించే స్త్రీల నిజ జీవితం గురించి మీకు తెలుసా అని చిత్రనిర్మాతలను ఆమె ప్రశ్నించారు.

రిచా మాట్లాడుతూ..' 2010-2012 కాలంలో బాలీవుడ్‌లో మహిళలు స్మోకింగ్ చేసేవారని కొందరు చెడుగా చూపించారు. అంటే సిగరెట్‌ తాగి.. నైట్ క్లబ్‌ వెళ్లేవారని కొందరు దర్శకులు బ్యాడ్‌గా రాశారు. ‍అంతేకాదు క్లబ్‌ల్లో డ్యాన్స్ చేసేవారి పాత్రలను చాలా చెడ్డగా చిత్రీకరించినట్లు గుర్తించా. నేను ఆ చిత్ర నిర్మాతలను ఒక్కటే అడగాలనుకుంటున్నా.అసలు అలాంటి మహిళల గురించి మీకు తెలుసా?. మహిళల త్యాగం గురించి మీకేం తెలుసు. మా ఎముకల నుంచి ఒక బిడ్డను తయారు చేస్తాం. మా రక్తంతో వారికి పోషకాలు అందిస్తాం. పిల్లల కోసం మా జుట్టు, నిద్ర అన్ని దూరమవుతాయి. అంతకుమించిన త్యాగం ఉంటుందా? అంతకంటే ఎక్కువ ఎవరైనా చేయగలరా? ' అని ఆమె ప్రశ్నించారు.

కాగా.. రిచా చద్దా చివరిసారిగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన హీరామండి: ది డైమండ్ బజార్‌లో కనిపించింది. ఇందులో సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, తాహా షా బాదుషా కూడా నటించారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా రిచా ఇటీవల గర్ల్స్ విల్ బి గర్ల్స్ అనే సినిమాతో నిర్మాతగా మారారు. ఇది ఇండియాలోని బోర్డింగ్ స్కూల్‌లో చదువుతున్న యువతి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ‍అవుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement