లవ్ ‘సీన్’ చాలా కష్టం | Richa Chadha not in 'Kaacha Love, Pakke Dost' | Sakshi
Sakshi News home page

లవ్ ‘సీన్’ చాలా కష్టం

Published Fri, Aug 1 2014 11:17 PM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

లవ్ ‘సీన్’ చాలా కష్టం

లవ్ ‘సీన్’ చాలా కష్టం

హీరోయిన్ రిచా చద్దా
ముంబై: ‘సినిమాలోని ప్రేమ, రొమాన్స్ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టం.. చుట్టూ వందలాది మంది ఉంటుండగా లవ్ సీన్ పండించడమంటే మామూలు విషయం కాదు’.. అని అంటోంది అందాల తార రిచా చద్దా. ఆమె నటించిన ‘తమంచే’ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ఆమె మాట్లాడింది. తమంచే మంచి రొమాన్స్ థ్రిల్లర్ కథ అని చెప్పింది. ఈ సినిమాలో హీరోగా నిఖిల్ నటించాడని, తమద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండిందని తెలిపింది. ‘ప్రేమ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నటుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చుట్టూ చాలామంది షూటింగ్ సిబ్బంది ఉంటారు.. ఒక సీన్ బాగా వచ్చిందని డెరైక్టర్ అనుకునేంతవరకు నటీనటులు అలా నటిస్తూనే ఉండాలి.. రొమాన్స్‌లోనూ డెరైక్టర్‌కు కావాల్సినట్లు భావాలను పలికించడం అంతమంది మధ్యలో చాలా కష్టసాధ్యమైనఫీట్..’ అని ఆమె అభిప్రాయపడింది.

కాగా, రిచా అభిప్రాయంతో హీరో నిఖిల్ ఏకీభవించాడు. అతడు మాట్లాడుతూ.. సినిమాల్లో ఫైట్లు, పాటలు చేయడం చాలా సులభం. రొమాన్స్, ప్రేమ సన్నివేశాలు చేయడం చాలా కష్టమన్నాడు. తమంచేలో బాబు (రిచా చద్దా), మున్నా (నిఖిల్ ద్వివేది) ప్రేమికులు. వారి ప్రేమకు ఎన్ని అవరోధాలు ఏర్పడ్డాయి.. వాటిని వారిద్దరూ ఎలా తట్టుకొని తమ ప్రేమను నిలబెట్టుకున్నారు అనేది సినిమా ఇతివృత్తం.

గ్యాంగ్‌స్టర్లు, హింస నేపథ్యంలో ఈ ప్రేమ కథ సాగుతుంది. ఇంతకుముందు తాను నటించిన‘ఫక్రీ’లోని ‘భోలీ పంజాబన్’కు, తమంచేలోని ‘బాబు’కు వేషభాషల్లో ఎటువంటి పోలిక లేదని రిచా చెప్పింది. ‘బాబు’ది రఫ్ క్యారెక్టర్.. పక్కా ముంబై లోకల్ యాసలో మాట్లాడుతుందని రిచా వివరించింది. ‘ముంబైలో నేను ఐదారేళ్లుగా ఉంటున్నా.. రోడ్లపై తిరిగేటప్పుడే ఇక్కడ భాషపై పట్టు వచ్చింది..అదే ఇప్పుడు  ఉపయోగపడింది’..అని వివరించింది.  నవనీత్ బేహల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 19వ తేదీన సినిమా దేశవ్యాప్తంగా విడుదల అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement