romance scenes
-
ఛీఛీ ఏం పనిది!
చీ ఎం పనిది ఈ చీత్కారం ఎవరు, ఎవరిపై చేశారో తెలుసా? ఇవాళ సినిమా ట్రెండ్ మారిందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1980–90 చిత్రాలతో నేటి చిత్రాలను ఏ విధంగానూ పోల్చజాలం. ముఖ్యంగా కథానాయికల దుస్తులు, వారి పాత్రల తీరు తెన్నులు చాలా మందికి నచ్చడం లేదు. కేవలం యూత్‌ను ఆకట్టుకుని వ్యాపార పరంగా లబ్ధి పొందే దృక్పథంతోనే హీరోయిన్ల రూపకల్పన జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సినిమా వ్యాపారమే కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడలేం. అసలు విషయం ఏమిటంటే తిరుట్టుప్పయలే–2 చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ఇందులో బాబీసింహా, ప్రసన్న, అమలాపాల్ ప్రధాన పాత్రలు పోషించారు. అందులో చిటపట చినుకుల్లో బొడ్డుకిందకు చీరకట్టుకున్న అమలాపాల్‌ను బాబీసింహా గట్టిగా బిగికౌగిలిలో బంధించేలా సన్నివేశం చోటుచేసుకుంది. చిత్ర ప్రకటనల్లోనూ ఈ ఫొటోనే వాడారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా నటి అమలాపాల్ ఒక పత్రికకిచ్చిన భేటీలో తాను బాబీసింహా కౌగిలించుకున్న సన్నివేశం చోటు చేసుకుందని, ఆ దృశ్యంలో తన నాభి గురించి ఇంత చర్చ జరుగుతుందని తాను ఊహించలేదంది. చిత్రంలో రొమాన్స్ సన్నివేశాల్లో నటించడానికి బాబీసింహా తటపటాయించారని, తానే చొరవ తీసుకుని ఆయన్ని నటింపజేశానని చెప్పింది. హిందీ చిత్రం పద్మావతి గురించి ఇటీవల ఒక టీవీలో జరిగిన చర్చావేదికలో పాల్గొన్న ప్రముఖ ఎడిటర్ లెనిన్ అమలాపాల్ ఇంటర్వ్యూను ప్రచురించిన పత్రికను చూపిస్తూ ఛీ ఛీ ఏంపనిది అంటూ చీరేశారు. మరి ఈ విషయం నటి అమలాపాల్ దృష్టికి వెళ్లిందో లేదో? ఒక వేళ వెళితే తను ఎలా స్పందిస్తుందో చూడాలి. -
రణవీర్‌తో రొమాన్స్ సీన్లు అలా ఉండవు: ఐష్
ముంబై: ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో హీరో రణవీర్ కపూర్‌తో తాను నటించిన రొమాన్స్ సన్నివేశాలపై అందాలతార ఐశ్వర్యా రాయ్ వివరణ ఇచ్చింది. ఈ దృశ్యాలు అసభ్యకరంగా ఉండవని, కళాత్మకంగా ఉంటాయని చెప్పింది. విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్లో ఐష్ హాట్‌హాట్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. పొట్టి దుస్తులు వేసుకుని రణవీర్ పక్కన ఐష్ రెచ్చిపోవడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. అంతేగాక రణవీర్, ఐష్ నటించిన కొన్ని రొమాన్స్ దృశ్యాలను సెన్సార్ బోర్డు కట్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో తాను ఎక్కడా పరిధిదాటి నటించలేదని ఐష్ అంటోంది. 'ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుంది. దర్శకుడి సలహా మేరకు హుందాగా నటించాను. హీరో రణవీర్‌తో కలసి చేసిన ఆన్ స్ర్కీన్ రొమాన్స్ కళాత్మకంగా ఉంటుంది. దీని గురించి నేను ఆందోళన చెందడం లేదు' అని ఐష్ చెప్పింది. దర్శకుడు కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఐశ్వర్య తన పాత్ర ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, అద్భుతంగా నటించిందని చెప్పాడు. ఈ సినిమాలో స్కిన్ షో లేదా లిప్ లాక్ సన్నివేశాలు లేవని తెలిపాడు. -
లవ్ ‘సీన్’ చాలా కష్టం
హీరోయిన్ రిచా చద్దా ముంబై: ‘సినిమాలోని ప్రేమ, రొమాన్స్ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టం.. చుట్టూ వందలాది మంది ఉంటుండగా లవ్ సీన్ పండించడమంటే మామూలు విషయం కాదు’.. అని అంటోంది అందాల తార రిచా చద్దా. ఆమె నటించిన ‘తమంచే’ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ఆమె మాట్లాడింది. తమంచే మంచి రొమాన్స్ థ్రిల్లర్ కథ అని చెప్పింది. ఈ సినిమాలో హీరోగా నిఖిల్ నటించాడని, తమద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండిందని తెలిపింది. ‘ప్రేమ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నటుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చుట్టూ చాలామంది షూటింగ్ సిబ్బంది ఉంటారు.. ఒక సీన్ బాగా వచ్చిందని డెరైక్టర్ అనుకునేంతవరకు నటీనటులు అలా నటిస్తూనే ఉండాలి.. రొమాన్స్‌లోనూ డెరైక్టర్‌కు కావాల్సినట్లు భావాలను పలికించడం అంతమంది మధ్యలో చాలా కష్టసాధ్యమైనఫీట్..’ అని ఆమె అభిప్రాయపడింది. కాగా, రిచా అభిప్రాయంతో హీరో నిఖిల్ ఏకీభవించాడు. అతడు మాట్లాడుతూ.. సినిమాల్లో ఫైట్లు, పాటలు చేయడం చాలా సులభం. రొమాన్స్, ప్రేమ సన్నివేశాలు చేయడం చాలా కష్టమన్నాడు. తమంచేలో బాబు (రిచా చద్దా), మున్నా (నిఖిల్ ద్వివేది) ప్రేమికులు. వారి ప్రేమకు ఎన్ని అవరోధాలు ఏర్పడ్డాయి.. వాటిని వారిద్దరూ ఎలా తట్టుకొని తమ ప్రేమను నిలబెట్టుకున్నారు అనేది సినిమా ఇతివృత్తం. గ్యాంగ్స్టర్లు, హింస నేపథ్యంలో ఈ ప్రేమ కథ సాగుతుంది. ఇంతకుముందు తాను నటించిన‘ఫక్రీ’లోని ‘భోలీ పంజాబన్’కు, తమంచేలోని ‘బాబు’కు వేషభాషల్లో ఎటువంటి పోలిక లేదని రిచా చెప్పింది. ‘బాబు’ది రఫ్ క్యారెక్టర్.. పక్కా ముంబై లోకల్ యాసలో మాట్లాడుతుందని రిచా వివరించింది. ‘ముంబైలో నేను ఐదారేళ్లుగా ఉంటున్నా.. రోడ్లపై తిరిగేటప్పుడే ఇక్కడ భాషపై పట్టు వచ్చింది..అదే ఇప్పుడు ఉపయోగపడింది’..అని వివరించింది. నవనీత్ బేహల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 19వ తేదీన సినిమా దేశవ్యాప్తంగా విడుదల అవుతోంది.