Love Scene
-
స్టైలిష్ స్టార్ కూడా ఫిదా అయ్యాడు..
సాక్షి, హైదరాబాద్: ఒక రోజులోనే సోషల్‌మీడియా స్టార్ అయిపోయింది హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్. ఆమె నటించిన ‘ఓరు అదార్ లవ్’ సినిమాకు సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫిదా అయ్యాడు. అంతేకాక ఏకంగా తన ట్వీటర్ అకౌంట్లో ఆ వీడియోను పోస్టు చేశాడు. నేను చూసిన క్యూట్ వీడియోల్లో ఇది ఒకటి. ది పవర్ ఆఫ్ సింప్లిసిటీ. లవ్ ఇట్’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. ‘ఓరు అదార్ లవ్’ చిత్రం మార్చి 3న విడుదల అవుతోంది. ఆ సాంగ్‌లో హీరో హీరోయిన్ల కనురెప్పలతోనే మాట్లాడుకుంటారు. వారు కనురెప్పలు ఎగరేయడం, కన్ను కొట్టుకొవడం వంటి హావభావాలతోనే లవ్ ప్రపోజ్ చేసుకుంటారు. తరగతి గదిలో జరిగే ఈ సన్నివేశాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మాయి హావభావాలే చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోకి 40 లక్షల వ్యూస్ కూడా వచ్చాయి. -
ఇది నమ్మలేకపోతున్నా..
నిన్నటి వరకు ఆమె పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ నేడు ఆమె పేరు దేశం యావత్తు మార్మోగుతోంది. ‘కంటి బాస’తోనే కుర్రకారును ఊర్రూతలూగిస్తోంది. ఓవర్‌నైట్‌లోనే సోషల్ మీడియా సూపర్‌స్టార్‌ను చేసేయడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె ఎవరే కాదు మలయాళం హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్. అనూహ్యంగా పాపులారిటీ దక్కడంతో ఆమె హర్షం వ్యక్తం చేసింది. తనపై చూపించిన అభిమానానికి పొంగిపోతోంది. తనకు దక్కిన విశేషాదరణపై ట్విటర్లో స్పందించింది. సోషల్ మీడియాలో తాను జాతీయస్థాయిలో స్టార్‌గా మారడాన్ని నమ్మకలేపోతున్నానని ప్రియా ప్రకాశ్ ట్వీట్ చేసింది. తనపై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపింది. 'ఓరు అదార్ లవ్' సినిమాతో వెండితెరకు ఆమె పరిచయమవుతోంది. ఈ సినిమా మార్చి 3న విడుదలకానుంది. ఈ మూవీలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ప్రియ వ్యాఖ్యానించింది. ఈ చిత్రంలోని మాణిక్య మలారయ పూవి పాటలో కనులతో ప్రియ వ్యక్తపరిచిన హావభావాలకు అందరూ ఫిదా అయ్యారు. ఇప్పటివరకు ఈ పాటకు యూట్యూబ్‌లో 40 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. మరోవైపు ప్రియా ప్రకాశ్ వారియర్‌ను ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరించేవారి సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి Good morning everyone. Can't belive this, #NationalTrend Thank you so much for your love and supports 💓💓💓 pic.twitter.com/CblAfSWm55 — Priya Prakash Varrier (@priyapvarrier) 12 February 2018 -
ఆమె కనుసైగలకు..అబ్బాయిలు ఫిదా!
-
ఆమె కనుసైగలకు..అబ్బాయిలు ఫిదా!
ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే ఫీవర్ నడుస్తోంది. ఓ అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి ఎలా ప్రపోజ్ చేయాలి..? అని తికమకపడుతున్న ఈ సమయంలో... ఓ హైస్కూల్ అబ్బాయి-అమ్మాయి కళ్లతోనే ఐ లవ్ యూ చెప్పే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇక ఈ అమ్మాయి చూపించే కనుసైగలకు అబ్బాయిల మనసులు ఫుల్‌గా ఫిదా అయిపోతున్నాయి. ఈ వీడియో మళయాలంలోని 'ఓరు అదార్ లవ్' పేరుతో తెరకెక్కుతున్న సినిమాలోనిది. ఈ సినిమా మార్చి 3న విడుదల కాబోతుంది. ఈ మూవీకి సంబంధించి ఓ సాంగ్ చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. మాటలు లేకుండా కేవలం హీరో హీరోయిన్ కనుబొమ్మలను ఎగరేయడం, కన్ను కొట్టుకోవడం వంటి హావభావాలతోనే లవ్ ప్రపోజ్ చేసుకుంటారు. క్లాస్ రూంలో జరిగే ఈ లవ్ ట్రాక్‌ని అద్భుతంగా చిత్రీకరించారు. పదే పదే ఆ వీడియోను చూస్తూ... ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ప్రియా ప్రకాశ్ వారియర్‌నే అబ్బాయిలు వాట్సాప్ స్టేటస్‌లుగా పెట్టేసుకుంటున్నారు. ఒక్క రోజులోనే ఈ అమ్మాయి సోషల్ మీడియా స్టార్ అయిపోయింది కూడా. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, పలు న్యూస్ పోర్టల్స్ అన్నింటిలోనూ ఈ అమ్మాయి హావభావాలే చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియో విడుదలైన 8 గంటల్లోనే ప్రియా ప్రకాశ్ ఇన్‌స్ట్రాగ్రామ్‌కు 4 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. 26 సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో అతి కొద్ది సమయంలో.. ఎక్కువ షేర్లు అయిన క్లిప్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ వీడియోకి 40 లక్షల వ్యూస్ కూడా వచ్చాయి. వాలెంటైన్స్ డే వీక్ నడుస్తుండటంతో.. ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇలాంటి ఒక్క అమ్మాయి ఉంటే చాలు... క్లాస్‌లో అబ్బాయిల అటెండెన్స్ 100 శాతం ఉంటుందంటూ సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. New crush#PriyaPrakash#PriyaPrakashVarrier 💖💖💖💖💖💖💖💖 pic.twitter.com/bYUy8wtIfC — Prabhas (@pavansaaho21) February 11, 2018 Sequence of events pic.twitter.com/4ZEhLaQAql — Hitarth Desai (@filmeyshilmey_) February 11, 2018 -
లవ్ ‘సీన్’ చాలా కష్టం
హీరోయిన్ రిచా చద్దా ముంబై: ‘సినిమాలోని ప్రేమ, రొమాన్స్ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టం.. చుట్టూ వందలాది మంది ఉంటుండగా లవ్ సీన్ పండించడమంటే మామూలు విషయం కాదు’.. అని అంటోంది అందాల తార రిచా చద్దా. ఆమె నటించిన ‘తమంచే’ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ఆమె మాట్లాడింది. తమంచే మంచి రొమాన్స్ థ్రిల్లర్ కథ అని చెప్పింది. ఈ సినిమాలో హీరోగా నిఖిల్ నటించాడని, తమద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండిందని తెలిపింది. ‘ప్రేమ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నటుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చుట్టూ చాలామంది షూటింగ్ సిబ్బంది ఉంటారు.. ఒక సీన్ బాగా వచ్చిందని డెరైక్టర్ అనుకునేంతవరకు నటీనటులు అలా నటిస్తూనే ఉండాలి.. రొమాన్స్‌లోనూ డెరైక్టర్‌కు కావాల్సినట్లు భావాలను పలికించడం అంతమంది మధ్యలో చాలా కష్టసాధ్యమైనఫీట్..’ అని ఆమె అభిప్రాయపడింది. కాగా, రిచా అభిప్రాయంతో హీరో నిఖిల్ ఏకీభవించాడు. అతడు మాట్లాడుతూ.. సినిమాల్లో ఫైట్లు, పాటలు చేయడం చాలా సులభం. రొమాన్స్, ప్రేమ సన్నివేశాలు చేయడం చాలా కష్టమన్నాడు. తమంచేలో బాబు (రిచా చద్దా), మున్నా (నిఖిల్ ద్వివేది) ప్రేమికులు. వారి ప్రేమకు ఎన్ని అవరోధాలు ఏర్పడ్డాయి.. వాటిని వారిద్దరూ ఎలా తట్టుకొని తమ ప్రేమను నిలబెట్టుకున్నారు అనేది సినిమా ఇతివృత్తం. గ్యాంగ్స్టర్లు, హింస నేపథ్యంలో ఈ ప్రేమ కథ సాగుతుంది. ఇంతకుముందు తాను నటించిన‘ఫక్రీ’లోని ‘భోలీ పంజాబన్’కు, తమంచేలోని ‘బాబు’కు వేషభాషల్లో ఎటువంటి పోలిక లేదని రిచా చెప్పింది. ‘బాబు’ది రఫ్ క్యారెక్టర్.. పక్కా ముంబై లోకల్ యాసలో మాట్లాడుతుందని రిచా వివరించింది. ‘ముంబైలో నేను ఐదారేళ్లుగా ఉంటున్నా.. రోడ్లపై తిరిగేటప్పుడే ఇక్కడ భాషపై పట్టు వచ్చింది..అదే ఇప్పుడు ఉపయోగపడింది’..అని వివరించింది. నవనీత్ బేహల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 19వ తేదీన సినిమా దేశవ్యాప్తంగా విడుదల అవుతోంది.