ఇది నమ్మలేకపోతున్నా.. | Priya Prakash Varrier Tweet | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 12 2018 4:36 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

Priya Prakash Varrier Tweet - Sakshi

ప్రియా ప్రకాశ్‌ వారియర్ హావభావాలు

నిన్నటి వరకు ఆమె పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ నేడు ఆమె పేరు దేశం యావత్తు మార్మోగుతోంది. ‘కంటి బాస’తోనే కుర్రకారును ఊర్రూతలూగిస్తోంది. ఓవర్‌నైట్‌లోనే సోషల్ మీడియా సూపర్‌స్టార్‌ను చేసేయడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె ఎవరే కాదు మలయాళం హీరోయిన్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. అనూహ్యంగా పాపులారిటీ దక్కడంతో ఆమె హర్షం వ్యక్తం చేసింది. తనపై చూపించిన అభిమానానికి పొంగిపోతోంది. తనకు దక్కిన విశేషాదరణపై ట్విటర్‌లో స్పందించింది.   

సోషల్‌ మీడియాలో తాను జాతీయస్థాయిలో స్టార్‌గా మారడాన్ని నమ్మకలేపోతున్నానని ప్రియా ప్రకాశ్‌ ట్వీట్‌ చేసింది. తనపై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపింది. 'ఓరు అదార్‌ లవ్‌' సినిమాతో వెండితెరకు ఆమె పరిచయమవుతోంది. ఈ సినిమా మార్చి 3న విడుదలకానుంది. ఈ మూవీలో నటిస్తున్నం‍దుకు చాలా సంతోషంగా ఉందని ప్రియ వ్యాఖ్యానించింది.

ఈ చిత్రంలోని మాణిక్య మలారయ పూవి పాటలో కనులతో ప్రియ వ్యక్తపరిచిన హావభావాలకు అందరూ ఫిదా అయ్యారు. ఇప్పటివరకు ఈ పాటకు యూట్యూబ్‌లో 40 లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ క్లిప్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా షేర్‌ అవుతోంది. మరోవైపు ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరించేవారి సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement