స్టైలిష్‌ స్టార్‌ కూడా ఫిదా అయ్యాడు.. | allu arjun post oru adaar love video in his twitter account | Sakshi
Sakshi News home page

స్టైలిష్‌ స్టార్‌ కూడా ఫిదా అయ్యాడు..

Published Tue, Feb 13 2018 3:20 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

allu arjun post oru adaar love video in his twitter account - Sakshi

అల్లు అర్జున్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్

సాక్షి, హైదరాబాద్‌: ఒక రోజులోనే సోషల్‌మీడియా స్టార్‌ అయిపోయింది హీరోయిన్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఆమె నటించిన ‘ఓరు అదార్‌ లవ్‌’ సినిమాకు సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియా, యూట్యూబ్‌లలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియోకు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా ఫిదా అయ్యాడు. అంతేకాక ఏకంగా తన ట్వీటర్‌ అకౌంట్‌లో ఆ వీడియోను పోస్టు చేశాడు. నేను చూసిన క్యూట్‌ వీడియోల్లో ఇది ఒకటి. ది పవర్‌ ఆఫ్‌ సింప్లిసిటీ. లవ్‌ ఇట్‌’ అని అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశాడు. 

‘ఓరు అదార్‌ లవ్‌’ చిత్రం మార్చి 3న విడుదల అవుతోంది. ఆ సాంగ్‌లో హీరో హీరోయిన్‌ల కనురెప్పలతోనే మాట్లాడుకుంటారు. వారు కనురెప్పలు ఎగరేయడం, కన్ను కొట్టుకొవడం వంటి హావభావాలతోనే లవ్‌ ప్రపోజ్‌ చేసుకుంటారు. తరగతి గదిలో జరిగే ఈ సన్నివేశాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ అమ్మాయి హావభావాలే చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోకి 40 లక్షల వ్యూస్‌ కూడా వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement