Actress Richa Chadha Said My First Love Was Rahul Dravid - Sakshi
Sakshi News home page

Rahul Dravid: నా ఫస్ట్‌లవ్‌ ద్రవిడ్‌.. తన కోసం మళ్లీ క్రికెట్‌ చూస్తా: నటి

Published Tue, Nov 23 2021 7:23 AM | Last Updated on Tue, Nov 23 2021 8:16 AM

As Rahul Dravid Returns To Indian Dressing Room Richa Chadha On First Love - Sakshi

As Rahul Dravid Returns To Indian Dressing Room Richa Chadha On First Love: మిస్టర్‌ డిపెండబుల్‌, టీమిండియా మాజీ సారథి, ప్రస్తుత హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ఏ ‘పాత్ర’ పోషించినా సరే తనకంటూ ప్రత్యేకత గుర్తింపు దక్కించుకోవడం అతడికి అలవాటు. అందుకే అతడి కోసమే మ్యాచ్‌ చూసేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రత్యర్థి జట్లకు అవకాశం ఇవ్వకుండా ‘అడ్డుగోడ’గా నిలబడి జట్టును అనేక సార్లు విజయపథంలో నిలిపిన ‘వాల్‌’ ద్రవిడ్‌.. ఇప్పుడు టీమిండియా హెడ్‌కోచ్‌గానూ తన పాత్ర ఎలా ఉండబోతుందో తొలి సిరీస్‌ విజయంతో చెప్పకనే చెప్పాడు.

ద్రవిడ్‌ మార్దనిర్దేశనంలో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటి రిచా చద్దా ద్రవిడ్‌ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడిన రిచా.. ‘‘యవ్వన దశలో ఉన్నపుడు క్రికెట్‌ అంటే నాకు అభిమానం ఉండేది. ఇంకోరకంగా చెప్పాలంటే పిచ్చి అనవచ్చు.

నా సోదరుడు క్రికెట్‌ ఆడేవాడు. మ్యాచ్‌ ఉందంటే టీవీకే అతుక్కుపోయేదాన్ని. రాహుల్‌ ద్రవిడ్‌ ఆట అంటే నాకు ఎంతో ఇష్టం. అయితే, తను రిటైర్‌మెంట్‌కు దగ్గరవుతున్న కొద్దీ క్రికెట్‌ చూడటం మానేశాను. నా ఫస్ట్‌లవ్‌ రాహుల్‌ ద్రవిడ్‌. అందుకే తను లేని ఆటను చూడలేకపోయాను’’ అని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు తను మరో రూపంలో డ్రెస్సింగ్‌రూంలో సందడి చేస్తున్నడు కాబట్టి.. మళ్లీ క్రికెట్‌ చూడటం ఆరంభిస్తానని రిచా పేర్కొన్నారు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు 2011లో వీడ్కోలు పలికిన ద్రవిడ్‌.. ఆ మరుసటి ఏడాది టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పాడు. 

చదవండి: SMAT 2021 Winner Tamil Nadu: తమిళనాడు తడాఖా.. మూడోసారి టైటిల్‌ సొంతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement