బాలీవుడ్ నటి రీచా చద్దా మెయిన్‌లీడ్‌గా నటిస్తోన్న చిత్రం 'మేడమ్ చీఫ్ మినిస్టర్' విడుదలకు ముందే వివాదాస్పదం అవుతోంది. తాజాగా రిలీజైన ఈ సినిమా పోస్టర్ దళితులను అవమానించేలా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటరానివారు అనే పదాన్ని ఈ చిత్రంలో ఉపయోగించారని, మెయిన్‌లీడ్ పోషించిన రీచా చీపురు పట్టుకున్నట్లు చూపించడం కూడా అభ్యంతరకంగా ఉందని, దీన్ని చిత్రం నుంచి తీసేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే తనకు వందల సంఖ్యలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నటి రీచా పేర్కొన్నారు. ఆమె నాలుకను కోసేయండంటూ ఓ రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ..మేం ఎవరికీ భయపడం అంటూ రీచా ట్వీట్ చేశారు. (నటిపై ఆరోపణలు; రూ. కోటి పరువు నష్టం దావా)
మరోవైపు నటి స్వర భాస్కర్ సహా పలువురు రీచాకు మద్దతు తెలుపుతున్నారు. సినిమా పరంగా విమర్శించే హక్కు ఉంటుంది కానీ ఇలా హింసకు ప్రేరేపించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఇలాంటి నేరపూరిత బెదిరింపులకు వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ నిలబడాలని తెలుపుతూ నాట్ ఓకే (not ok)అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఓ సాధారణ మహిళ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగిందనే కథాంశంతో పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇందులో హీరోయిన్‌గా నటించిన రీచా చద్దా పాత్ర మాయావతిలా కనిపిస్తుండం ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈనెల 22న విడుదల కానున్న ఈ చిత్రంలో సౌరభ్ శుక్లా, మనావ్ కౌల్, అక్షయ్ఒబేరాయ్ ముఖ్యపాత్రలు పోషించారు. (ఆ రెండింటి విషయంలో కంట్రోల్‌గా ఉండలేను)
Comments
Please login to add a commentAdd a comment