రిలీజ్‌కు ముందే అవార్డుల పంట.. ఆ సినిమా అరుదైన ఘనత! | Richa Chadha Movie Wins Grand Jury Prize At Indian Film Festival In Los Angeles, Deets Inside | Sakshi
Sakshi News home page

Richa Chadha: రిలీజ్‌కు ముందే అవార్డులు కొల్లగొడుతున్న చిన్న సినిమా!

Published Tue, Jul 2 2024 3:25 PM | Last Updated on Tue, Jul 2 2024 3:54 PM

Richa Chadha Movie wins big at Indian Film Festival at Los Angeles

కని కస్రుతి,  ప్రీతి పాణిగ్రాహి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గర్ల్స్ విల్ బి గర్ల్స్'. ఈ చిత్రానికి సుచి తలాటి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి అరుదైన ఘనత దక్కింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్ (IFFLA)లో గ్రాండ్ జ్యూరీ బహుమతిని గెలుచుకుంది. రిచా, చద్దా అలీల నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే పలు ప్రశంసలు అందుకుంది.

ఈ సినిమా ఇప్పటికే రొమేనియాలోని ట్రాన్సిల్వేనియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్రాన్స్‌లోని బియారిట్జ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ జ్యూరీ ప్రైజ్‌లను గెలుచుకుంది. అంతే కాకుండా సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో రెండు ప్రధాన అవార్డులను కూడా గెలుచుకుంది. తమ చిత్రం పెద్ద విజయం సాధించడం పట్ల  రిచా చద్దా ఆనందం వ్యక్తం చేశారు.

రిచా మాట్లాడుతూ.. " మా చిత్రం గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ గెలవడం ఒక అపురూపమైన గౌరవం. మా టీమ్ మొత్తం కృషి, అంకితభావాన్ని గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. 'గర్ల్స్ విల్ బి గర్ల్స్' అనేది మన హృదయాలకు దగ్గరైన కథ. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్

Advertisement
 
Advertisement