'రౌడీ వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోను' | Richa speaks up against 'rowdy behaviour' | Sakshi
Sakshi News home page

'రౌడీ వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోను'

Published Fri, Dec 26 2014 3:17 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'రౌడీ వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోను' - Sakshi

'రౌడీ వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోను'

న్యూఢిల్లీ: వెండితెరపై సాహసోపేతమైన పాత్రలు పోషించిన బాలీవుడ్ నటి రిచా చద్దా నిజజీవితంలోనూ తెగువ చూపించింది. తనను ఇబ్బంది పెట్టిన ఇద్దరు మగాళ్లను చెడామడా తిట్టిపోసింది. రౌడీ వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించింది.

తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో ఇద్దరు పురుషులు ఆమె వెంట పడ్డారు. ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లారు. అక్కడితో ఆగకుండా ఆమె వస్త్రధారణపై అసభ్యకర కామెంట్లు చేశారు. వీరిలో ఒకడు ఆమె ఫోటోలు తీసేందుకు ప్రయత్నించాడు.

అప్పటివరకు మౌనంగా భరించిన చద్దా ఇక ఊరుకోకుండా వారిపై తిరగబడింది. పిచ్చివేషాలు వేస్తే ఊరుకోబోనని హెచ్చరించింది. సెక్యురిటీ సిబ్బంది వచ్చి సర్దిచెప్పడంతో ఆమె శాంతించింది. ఈ ఘటనపై రిచా చద్దా స్పందిస్తూ... 'పబ్లిక్ పర్సనాలిటీ, పబ్లిక్ ప్రాపర్టీ మధ్య బేధాన్ని ప్రజలు మర్చిపోతున్నారు. దురుసు ప్రవర్తనను ఎవరూ సహించకూడదు. హద్దుమీరినప్పుడు గుణపాఠం చెప్పాలి' అని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement