
రిచా చద్దా
కొంతకాలంగా కోర్టుకు వెళ్తున్నారు బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా. కోర్టుమెట్లు ఎక్కేంత తప్పు ఆమె ఏం చేశారనేగా మీ డౌట్. అయితే ఆమె కోర్టుకెళుతున్నది ‘సెక్షన్ 375’ అనే సినిమా కోసమని బాలీవుడ్ ఖబర్. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 375 సెక్షన్ అనేది మానభంగానికి చెందిన సెక్షన్ అట. ఈ సినిమాలో లాయర్‌గా కనిపించనున్నారు రిచా. పాత్రకు న్యాయం చేయడానికి కోర్టు విధివిధానాలను పరిశీలించాలని ఆమె కోర్టుకు వెళ్తున్నారు. ‘‘నా స్నేహితురాలు ఒకరు కార్పొరేట్ కేసులను పరిష్కరించడంలో లాయర్‌గా నిపుణురాలు.
కానీ, మా సినిమా ఆ సెక్షన్‌కు సంబంధించింది కాదు. డిఫరెంట్ జోనర్‌లో ఉంటుంది. కానీ, కోర్టులో నేను తెలుసుకునే కొత్త విషయాలు నేను చేయబోయే పాత్రకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. వీలైనప్పుడు లాయర్స్‌తో మాట్లాడుతున్నాను’’ అని పేర్కొన్నారు రిచా. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా కథానాయకుడిగా నటిస్తారట. పది నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందట. మనీష్ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. షకీల బయోపిక్ ‘షకీల’ చిత్రంలో నటించారు రిచా. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment