కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. కానీ ఈ బాలీవుడ్ లవ్‌బర్డ్స్‌కు మాత్రం ఇంకా కళ్యాణ ఘడియలు దగ్గరపడలేదు. నటులు అలీ ఫజల్, రిచా చద్దా 2015 నుంచి డేటింగ్ చేస్తున్నారు. 2017లో రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ కోవిడ్ వల్ల వాయిదా వేసుకున్నారు. కొద్దిమందితో పెళ్లిని మమ అనిపించేకంటే అందరి సమక్షంలోనే ఈ వేడుకను వైభవంగా జరుపుకోవాలని ఈ జంట ఆశపడుతోంది. అందుకని వచ్చే ఏడాదికి పెళ్లిని వాయిదా వేసుకుంది.
మతాంతర వివాహంపై రిచా స్పందన
కాగా ఈ ఇద్దరూ ఒకే మతానికి చెందినవారు కాదు. అయినప్పటికీ ఇరు కుటుంబాలు పెద్ద మనసుతో వారి పెళ్లికి మనస్ఫూర్తిగా అంగీకరించడం విశేషం. ఈ విషయంపై రిచా చద్దా మాట్లాడుతూ తనిష్క్ వివాదాస్పద యాడ్‌ను ప్రస్తావించారు. నిజానికి ఆ యాడ్ చాలా బాగుందని ప్రశంసించారు. అందులో తన జీవితం ప్రతిబింబిస్తోందన్నారు. అలీ నుంచి, అతడి కుటుంబం నుంచి ఎంతో ప్రేమను పొందుతున్నానని పేర్కొన్నారు. కానీ పక్కవాళ్లు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారనేది కూడా పెద్ద సమస్యగా ఫీలవుతున్నవాళ్లను చూస్తే జాలేస్తోంది అని తెలిపారు. (చదవండి: కేవలం ఆమె కోసమే; ‘తనిష్క్‌పై’ నెటిజన్ల ఫైర్..)
యాడ్‌ను తొలగించిన తనిష్క్ యాడ్
కాగా ప్రముఖ ఆభరణాల సంస్థ తనిష్క్ ఏకత్వం పేరిట ఓ యాడ్ తీసుకొచ్చింది. ముస్లిం కుటుంబంలో అడుగు పెట్టిన హిందూ మహిళ కోడలిగా అడుగు పెడుతుంది. ఆమెను ఆప్యాయంగా ఆహ్వానించిన ఆ కుటుంబం హిందూ సాంప్రదాయం ప్రకారం సీమంతం నిర్వహిస్తుంది. ఇది రెండు వేర్వేరు మతాలు, సాంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక అని చెప్పుకొచ్చింది. కానీ ఇది లవ్ జిహాదీని ప్రోత్సహించే విధంగా ఉందంటూ వ్యతిరేకత రావడంతో సదరు కంపెనీ ఆ యాడ్‌ను తొలగించింది. (చదవండి: ఆ స్టార్ ప్రేమజంట పెళ్లి వాయిదా!)
Comments
Please login to add a commentAdd a comment