
ముంబై: ఇటీవల ఫిల్మ్ ఇండస్ట్రీలలో వివాదాస్పదంగా మారిన అంశం కాస్టింగ్ కౌచ్. అదేనండీ.. అవకాశాల పేరిట యువతులు, మహిళలను లైంగికంగా వేధించడం. హాలీవుడ్‌లో ఇద్దరు ప్రముఖ దర్శకనిర్మాతలపై వరుసగా నటీమణులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో బాలీవుడ్ హీరోయిన్లు సైతం కొందరు ఈ వివాదంపై స్పందించారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి రీచా చద్ధా వేధింపులపై మాట మార్చారు. తనపై ఎవరూ లైంగిక వేధింపులకు పాల్పడలేదని, అలాంటప్పుడు ఏ వేధింపుల గురించి చెప్పాలి. ఈ విషయంలో నన్ను వదిలేయండి ప్లీజ్ అంటూ సోషల్ మీడియాలో ఆమె విజ్ఞప్తి చేశారు.
వేధింపులకు పాల్పడిన వారి పేర్లు బహిర్గతం చేసేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని, కానీ తనకు రక్షణ కల్పిస్తానని హామీ ఇస్తే ఆ పని చేస్తానన్నారు. దీనిపై పలువురు ఆమెను సంప్రదించడంతో విసిగిపోయిన రీచా చద్ధా యూటర్న్ తీసుకుంది. ‘నన్ను వ్యక్తిగతంగా ఎవరూ వేధించలేదు. నాపై లైంగిక వేధింపులు జరగలేదు. నాకు ఎలాంటి చేదు అనుభవాలు లేదు. సెక్యూరిటీ అవసరం లేదు. కేవలం కాస్టింగ్ కౌచ్ వివాదంపై చర్చ జరగాలని, దీనిపై అందరికీ అవగాహనా తెచ్చేందుకు మాత్రమే వ్యాఖ్యలు చేశానని’ వరుస ట్వీట్లు చేశారు. మరోవైపు నటి జైరా వసీమ్ పై ఓ వ్యక్తి విమానంలోనే లైంగిక వేధింపులకు పాల్పడగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment