![Actress Richa Chadha Marriage With Ali Fazal In 2022, Details Inside - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/23/richa.gif.webp?itok=VLBc1Cwn)
Richa Chadha and Ali Fazal planning to tie the knot in March 2022: బాలీవుడ్‌లో వరుసగా లవ్‌బర్డ్స్ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా మరో ప్రేమ జంట పెళ్లికి సిద్ధమైంది. మసాన్ చిత్రంతో గుర్తింపు పొందిన నటి రిచా చద్దా గత కొంతకాలంగా ప్రియుడు, బాలీవుడ్ నటుడు ఆలీ ఫజల్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్‌లోనే వీరి పెళ్లి జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది.
తాజాగా 2022 మార్చిలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నట్లు బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ముంబైతో పాటు ఢిల్లీలోనూ పెళ్లి సంబరాలు జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ వేడుకకు అతికొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం.
ఇదిలా ఉండగా ప్రస్తుతం అలీ కొన్ని హాలీవుడ్ ప్రాజెక్టుల్లో సైతం నటిస్తున్నాడు. మరోవైపు రిచా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న ‘ హీరామండీ ’వెబ్‌సిరీస్‌లో కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment