
ముంబై : లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉంటున్నారు. ఫోటోలు, వీడియోలు పోస్టు చేయడంతోపాటు లైవ్ చాటింగ్‌లతో సందడి చేస్తున్నారు. నెటిజన్ల ప్రశ్నలకు సమాధానలు చెబుతూ వారికి కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె సోషల్ మీడియాలో శనివారం బూమరాంగ్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో దీపిక స్పూన్ పట్టుకొని ‘పుట్టిన రోజు కేక్ వారమంతా తిన్న తర్వాత నన్ను నేను పరిశీలించుకుంటున్నాను’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా ఈ నెల 6న దీపికా భర్త రణ్‌వీర్ సింగ్ 35 పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక దీపికా పోస్టుపై నెటిజన్లతోపాటు బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ స్పందించారు. (రణ్‌వీర్ పుట్టినరోజు.. దీపికా కామెంట్)
‘ఎంత శుభ్రమైన స్పూన్‌ను ఉపయోగిస్తున్నారు’. అని కార్తీక్ ఫన్నీగా కామెంట్ చేశారు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉంటూ స్నేహితుల పోస్టులపై కార్తీక్ సరదా కామెంట్లు చేస్తాడన్న విషయం తెలిసిందే. ఇటీవల తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలనుకుంటున్నారని కార్తీక్‌ను ఒక అభిమాని అడిగినప్పుడు దీపికా లాంటి భార్య కావాలని ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో వెల్లడించారు. ఆమె తన భర్త రణ్‌వీర్‌ను ఎంతో ప్రేమగా చూసుకుంటుందని అందుకే అలా సమాధానమిచ్చినట్లు కార్తీక్ వివరించారు. (అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా: కార్తీక్)
Comments
Please login to add a commentAdd a comment