ది గ్రేట్‌ ఖలీకి స్ఫూర్తినిస్తోన్న హీరో పాట | The Great Khali Inspiring From Kartik Aaryan Corona Song | Sakshi
Sakshi News home page

ది గ్రేట్‌ ఖలీకి స్ఫూర్తినిస్తోన్న హీరో పాట

Published Sat, Apr 18 2020 8:57 PM | Last Updated on Sat, Apr 18 2020 9:11 PM

The Great Khali Inspiring From Kartik Aaryan Corona Song - Sakshi

ది గ్రేట్‌ ఖలీ

కరోనా వైరస్‌పై బాలీవుడ్‌ కథానాయకుడు కార్తీక్‌ ఆర్యన్‌ పాడిన ర్యాప్‌ సాంగ్‌ బాగా పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. ‘కరోనా! స్టాప్‌ కరోనా’ అంటూ సాగే ఈ ర్యాప్‌తో సామాజిక దూరం, వైరస్‌ సోకకుండా ఉండేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి వివరించాడు ఆర్యన్‌. అయితే ఈ ర్యాప్‌కు ప్రముఖ రెస్లర్‌, డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్‌ ది గ్రేట్‌ ఖలీ ఫ్యాన్‌ అయిపోయారు. ఈ పాటనుంచి జిమ్‌ వర్కవుట్లు చేయటానికి కావాల్సిన స్ఫూర్తిని పొందుతున్నారు. ఖలీ ఈ పాట వింటూ జిమ్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆయనే తన టిక్‌టాక్‌ ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ( సర్‌ప్రైజ్‌ సూపర్‌!.. ఆ అట్టపెట్టెలో ఏముందంటే.. )

చదవండి : సర్పంచ్‌ను చితకబాదిన గ్రామస్తులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement