The Great Khali
-
'ది గ్రేట్ ఖలీ' ఏందయ్యా ఇదీ.. టోల్గేట్ సిబ్బందితోనా..!
చండీగఢ్: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, ప్రముఖ భారత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ(49) అలియాస్ దలీప్ సింగ్ రాణా మరోమారు వార్తల్లో నిలిచారు. పంజాబ్, లుధియానాలోని ఓ టోల్గేట్ వద్ద సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టోల్ కార్మికుడిపై ఖలీ చేయి చేసుకున్నాడని అక్కడి సిబ్బంది ఆరోపించారు. టోల్గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఖలీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే.. ఆ వీడియోలో టోల్ సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు. మరోవైపు.. లాధోవాల్ టోల్ ప్లాజా సిబ్బంది తనను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు దలిప్ సింగ్ రాణా. ఈ సంఘటన సోమవారం జరిగిందని పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్ నుంచి హరియాణాలోని కర్నాల్‌కు ఖలీ తన కారులో వెళ్తున్న క్రమంలో టోల్గేట్ వద్ద ఈ సంఘటన ఎదురైనట్లు చెప్పారు. ధ్రువీకరణ పత్రం అడిగిన తమ సిబ్బందిని ఎందుకు కొట్టారని ఖలీని టోల్ సిబ్బంది అడుగుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టమవుతోంది. 'మిమ్మల్ని ఐడీకార్డు చూపించాలని అడిగారు. ఐడీ చూపించండి' అని టోల్ సిబ్బంది అడగగా.. మీరు నన్ను బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు ఖలీ. దానికి 'మిమ్మల్ని మేము బ్లాక్మెయిల్ చేయటం లేదు.. అతడిని ఎందుకు కొట్టారు? మీ దగ్గర ఉంటే ఐడీ చూపించండి' అని టోల్ సిబ్బంది సమాధానమిచ్చారు. అయితే.. తన వద్ద ఎలాంటి ఐడీ కార్డు లేదని ఖలీ వారితో చెప్పారు. WWE wrestler #GreatKhali clashes with toll plaza staff at #Ludhiana#TheGreatKhali #ViralVideo #Punjab #Khali #ludhiana #WWE pic.twitter.com/XYJEhsdVtL — Vineet Sharma (@Vineetsharma906) July 12, 2022 ది గ్రేట్ ఖలీ వాహనం టోల్గేట్ దాటి వెళ్లకుండా ముందు బారికేడ్ పెట్టారు అక్కడి సిబ్బంది. దీంతో కోపంతో ఊగిపోయిన ఖలీ దానిని తీసి పక్కన పడేశారు. టోల్ సిబ్బంది ఖలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు కలుగజేసుకుని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇరువురు తమ వాదనలు పోలీసులకు వినిపించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన క్రమంలో వివరణ ఇచ్చారు ఖలీ. 'నిన్న పంజాబ్‌లోని లాధోవాల్ టోల్‌ప్లాజా వద్ద సిబ్బంది నా కారును అడ్డుకుని సెల్ఫీ కోసం నాతో అసభ్యంగా ప్రవర్తించారు. నేను అందుకు అంగీకరించకపోవటం వల్ల జాతివిద్వేష వ్యాఖ్యలు చేశారు. అలాగే కొన్ని బూతులు మాట్లాడారు.' అని ఖలీ చెప్పారు. ఇదీ చూడండి: దిల్లీ- ముంబైల మధ్య 'ఎలక్ట్రిక్ హైవే'.. దేశంలోనే తొలిసారి! -
రాజకీయాల్లోకి ‘ది గ్రేట్ ఖలీ'.. ఏ పార్టీలో చేరాడో చూడండి..?
The Great Khali Joins BJP: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, ప్రముఖ భారత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ(49) అలియాస్ దలీప్ సింగ్ రాణా రాజకీయ అరంగేట్రం చేశాడు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్నాడు. ప్రధాని మోదీ విధానాల పట్ల ఆకర్షితుడై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించాడు. త్వరలో జరగనున్న పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఖలీ బీజేపీలో చేరడం ఆ పార్టీకి అదనపు బలంగా మారవచ్చని రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించిన ఖలీ.. పోలీస్ ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా పంజాబ్‌కు వెళ్లి అక్కడే సెటిలయ్యాడు. అక్కడ ఓ పోలీస్ ఆఫీసర్ ప్రోద్భలం మేరకు రెజ్లర్‌గా మారిన అతను వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ)లో ఉన్నత శిఖరాలకు చేరాడు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ హోదా నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్‌గా ఎదిగాడు. ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఖలీ, భారత్ నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ కాంట్రాక్ట్ సైన్ చేసిన మొట్టమొదటి ప్రొఫెషనల్ రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు. #WATCH Professional wrestler Dalip Singh Rana, also known as The Great Khali, joins BJP in Delhi pic.twitter.com/BmB7WbpZzx — ANI (@ANI) February 10, 2022 7 అడుగులకు పైగా పొడవు, భారీ శరీరం కలిగిన ఖలీ, బాలీవుడ్‌తో పాటు పలు హాలీవుడ్ సినిమాల్లోనూ ప్రత్యేక పాత్రల్లో కనిపించాడు. అలాగే హిందీ రియాల్టీ షో బిగ్ బాష్ సీజన్ 4లో రన్నరప్‌గా నిలిచాడు. ఖలీకి ఈ తెర ఆ తెర అన్న తేడా లేకుండా విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇదిలా ఉంటే, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తరఫున ఎన్నికల ప్రచారం చేసిన ఖలీ, అదే పార్టీలో చేరతాడని అంతా ఊహించారు. అయితే, ఈ అజానుబాహుడు అందరికీ షాకిస్తూ.. ఇవాళ కమల తీర్ధం పుచ్చుకున్నాడు. చదవండి: రిషబ్ పంత్‌ను వరించిన ప్రతిష్టాత్మక అవార్డు -
ది గ్రేట్ ఖలీకి స్ఫూర్తినిస్తోన్న హీరో పాట
కరోనా వైరస్‌పై బాలీవుడ్ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ పాడిన ర్యాప్ సాంగ్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ‘కరోనా! స్టాప్ కరోనా’ అంటూ సాగే ఈ ర్యాప్‌తో సామాజిక దూరం, వైరస్ సోకకుండా ఉండేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి వివరించాడు ఆర్యన్. అయితే ఈ ర్యాప్‌కు ప్రముఖ రెస్లర్, డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ది గ్రేట్ ఖలీ ఫ్యాన్ అయిపోయారు. ఈ పాటనుంచి జిమ్ వర్కవుట్లు చేయటానికి కావాల్సిన స్ఫూర్తిని పొందుతున్నారు. ఖలీ ఈ పాట వింటూ జిమ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆయనే తన టిక్‌టాక్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( సర్ప్రైజ్ సూపర్!.. ఆ అట్టపెట్టెలో ఏముందంటే.. ) చదవండి : సర్పంచ్‌ను చితకబాదిన గ్రామస్తులు -
ఎన్నికల ప్రచారంలో ‘ది గ్రేట్ ఖలీ’
కోల్కత్తా: దేశం మొత్తం సార్వత్రిక ఎన్నికల ఫీవర్ కొనసాగుతుంది. కేవలం రాజకీయ నాయకులే కాకుండా పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తమ సహచరులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మరికొందరు ప్రచారంలో పాల్గొనక పోయిన సోషల్ మీడియా వారికి విషేస్ తెలియజేస్తున్నారు. తాజాగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) రెజ్లర్ ‘ది గ్రేట్ ఖలీ’ కూడా తన స్నేహితుని కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన అనుపమ్ హజ్రాకు మద్దతుగా ఖలీ ప్రచారంలో పాల్గొన్నారు. ‘నా స్నేహితుడు ఎన్నికల బరిలో నిలువడంతో అతనికి మద్దతు తెలుపడానికి అమెరికా నుంచి వచ్చాను. అతనికి ఓటు వేసి ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం కల్పించండి. మోదీ మంచి ప్రధాని. దేశం కోసం ఆయన ఎంతో చేశారు. ఆయనను చూసి నేను గర్వపడుతున్నాన’ని ఖలీ తెలిపారు. అయితే తను ఏ పార్టీకి మద్దతు తెలుపడం లేదని.. కేవలం తన స్నేహితుని కోసమే ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అనుపమ్ మాట్లాడుతూ.. ఖలీ తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలిపారు. తమ మధ్య ఉన్న స్నేహం కారణంగానే ఖలీ తొలిసారిగా ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని అన్నారు. ఖలీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో.. అతన్ని చూడటానికి జనాలు భారీగా తరలివచ్చారు. అతనితో కరచాలనం చేయడానికి, సెల్పీలు తీసుకోవడానికి జనాలు ఎగబడ్డారు. కాగా, అనుపమ్ 2014లో బోల్పూర్ పార్లమెంట్ స్థానం నుంచి టీఎంసీ తరఫున ఎంపీగా గెలుపొందారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డరానే కారణంతో టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఈ ఏడాది జనవరిలో అనుపమ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో అనుపమ్ మార్చిలో బీజేపీలో చేరారు. అయితే అనుపమ్‌కు పోటీగా టీఎంసీ ప్రముఖ బెంగాలీ నటి మిమి చక్రవర్తిని బరిలో నిలిపింది. -
జయంత్ సినిమాలో రెజ్లింగ్ స్టార్
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్లను డైరెక్ట్ చేసిన స్టైలిష్ డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ. కమర్షియల్ ఎంటర్టైనర్లతో ఆకట్టుకున్న జయంత్ కొంత కాలంగా సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. చివరగా గంటా రవితేజను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన జయదేవ్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు జయంత్. మరోసారి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన నిలేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు జయంత్. ‘నరేంద్ర’ అనే టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈషన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఈ సినిమాలో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ద గ్రేట్ ఖలీ కీలక పాత్రలో కనిపించనున్నాడు. -
రాజకీయ తీర్థం పుచ్చుకున్న ది గ్రేట్ ఖలీ
చండీగఢ్: ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆయన ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న ఆప్ ఇప్పటినుంచే పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఈ పార్టీ పంజాబ్ టార్గెట్‌గా వ్యూహాలు రచిస్తోంది. పలువురు ప్రముఖులు, ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఆప్‌లో చేరుతారని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ది గ్రేట్ ఖలీగా పేరొందిన దిలీప్‌సింగ్ రాణా ఆదివారం ఆప్ ముఖ్యనేతల సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ నేతలు ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 7.1 అడుగుల ఎత్తుతో మాంఛి బలిష్టంగా ఉండే ఖలీ రెజ్లింగ్ ఆటలో ప్రపంచస్థాయి ఆటగాడిగా కీర్తి సాధించారు. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించాడు. ఇటీవల ఉత్తరాఖండ్ హల్ద్వానీలో జరిగిన రెజ్లింగ్ షోలో ప్రత్యర్థులను చిత్తుచేసిన ఖలీ.. తన అభిమానులను అలరించాడు. -
వీడియో: ఖలీ పగ తీర్చుకున్నాడిలా..!
న్యూఢిల్లీ: రెజ్లింగ్ మ్యాచులో తనపై తీవ్రంగా దాడి చేసిన ప్రత్యర్థులను చిత్తుచేసి ది గ్రేట్ ఖలీ పగ తీర్చుకున్నాడు. ఆదివారం డెహ్రాడూన్‌లో జరిగిన రెజ్లింగ్ మ్యాచులో ఖలీ వీరవిహారం చేశాడు. తలకు బ్యాండెడ్ కట్టుకొని రింగులోకి దిగిన ఖలీ కెనడా రెజర్లపై భారీ పంచులు కురిపించాడు. ప్రధాన ప్రత్యర్థి అయిన బ్రాడీ స్టీల్‌ను చిత్తుగా ఓడించాడు. 'ది గ్రేట్ ఖలీ షో' పేరిట ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నాయి. అంతకుముందు జరిగిన మ్యాచులో కెనడియన్ రెజ్లర్ బ్రాడీ స్టీల్ ఖలీని తీవ్రంగా గాయపర్చిన సంగతి తెలిసిందే. స్టీల్, అతని సహచరులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో తలకు, చేతికి గాయాలైన ఖలీ ఐసీయూలో ఉండి చికిత్స పొందాడు. గాయాల నుంచి కోలుకొని ఆదివారం రింగులోకి దిగిన ఖలీ ప్రత్యర్థులపై దాడి చేసే దృశ్యాలతోపాటు.. అంతకుముందు అతనిపై కెనడా రెజర్లు విరుచుకుపడిన దృశ్యాలు కూడా ఈ వీడియోలో చూడొచ్చు. 7.1 అడుగుల ఎత్తుతో మాంఛి బలిష్టంగా ఉండే ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించాడు. -
ప్రత్యర్థిని చిత్తుచేసి పగ తీర్చుకున్న ఖలీ
డెహ్రాడూన్: డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ సూపర్ స్టార్ ది గ్రేట్ ఖలీ తనపై దాడిచేసిన ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆదివారం జరిగిన మ్యాచులో కెనడా రెజ్లర్ బ్రాడీ స్టీల్ ను చిత్తుగా ఓడించి తన సత్తా చాటాడు. డెహ్రాడూన్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి కిక్కిరిసిన అభిమానుల మధ్య ఖలీ వీరవిహారం చేశాడు. ఐదు రోజుల కిందట జరిగిన మ్యాచులో కెనడియన్ రెజ్లర్ బ్రాడీ స్టీల్ ఖలీని తీవ్రంగా గాయపర్చిన సంగతి తెలిసిందే. స్టీల్ తోపాటు అతని సహచరులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో తలకు, చేతికి గాయాలైన ఖలీ ఐసీయూలో ఉండి చికిత్స పొందాడు. ఈ సందర్బంగా తనపై దాడికి దిగిన రెజర్లను చిత్తుగా ఓడించి దెబ్బకు దెబ్బ తీస్తానని ఖలీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 'ది గ్రేట్ ఖలీ షో' పేరిట ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఈ కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన మ్యాచుకు ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్ ఉపాధ్యాయ్ హాజరై తిలకించారు. 7.1 అడుగుల ఎత్తుతో మాంఛి బలిష్టంగా ఉండే ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించాడు. -
రివేంజ్ కోసం పూజలు చేస్తున్న ఖలీ!
డెహ్రాడూన్: ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ కోలుకున్నాడు. ఆదివారం జరుగనున్న మ్యాచులో తనపై తీవ్రంగా దాడి చేసిన ప్రత్యర్థులపై రివేంజ్ తీర్చుకోవడానికి అతను సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా శనివారం డెహ్రాడూన్‌లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించాడు. ఈ పూజలో ఖలీతోపాటు అతని అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరఖండ్ బల్దానీలో గురువారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఖలీ తీవ్రంగా గాయపడ్డాడు. ఫైట్ సందర్భంగా రింగ్ బయట ఉన్న మరో ఇద్దరు విదేశీ రెజ్లర్లు కూడా వచ్చి ఖలీని కుర్చీతో ఇష్టమొచ్చినట్టు కొట్టడంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. మొత్తం ముగ్గురు కెనడాకు చెందిన రెజ్లర్లు ఖలీని కుర్చీతో కొట్టడమే కాక బలంగా పంచ్లివ్వడంతో ఆయన తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందిన ఖలీ శనివారం కోలుకొని డిశ్చార్జ్ అయ్యాడు. 'ది గ్రేట్ ఖలీ షో'లో భాగంగా ఆదివారం జరుగనున్న ఫైట్ కోసం సిద్ధమవుతున్నాడు. తనపై దాడి చేసిన ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటానని, తన తదుపరి ఫైట్‌లో దెబ్బకు దెబ్బ కొట్టి తన సత్తా చాటుతానని ఖలీ ఇప్పటికే ప్రకటించాడు. 7.1 అడుగుల ఎత్తుతో చూడడానికే రెస్లర్లుకు దడపుట్టించేలే ఉండే ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించాడు. భారత్ పేరును రెజ్లింగ్ ఖండాతరాలు దాటేలా చేశారు.