ప్రత్యర్థిని చిత్తుచేసి పగ తీర్చుకున్న ఖలీ | The Great Khali gets his revenge, trounces Brody Steel in Dehradun | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థిని చిత్తుచేసి పగ తీర్చుకున్న ఖలీ

Published Mon, Feb 29 2016 9:23 AM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM

ప్రత్యర్థిని చిత్తుచేసి పగ తీర్చుకున్న ఖలీ

ప్రత్యర్థిని చిత్తుచేసి పగ తీర్చుకున్న ఖలీ

డెహ్రాడూన్: డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ సూపర్ స్టార్ ది గ్రేట్ ఖలీ తనపై దాడిచేసిన ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆదివారం జరిగిన మ్యాచులో కెనడా రెజ్లర్ బ్రాడీ స్టీల్ ను చిత్తుగా ఓడించి తన సత్తా చాటాడు. డెహ్రాడూన్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి కిక్కిరిసిన అభిమానుల మధ్య ఖలీ వీరవిహారం చేశాడు. ఐదు రోజుల కిందట జరిగిన మ్యాచులో కెనడియన్ రెజ్లర్ బ్రాడీ స్టీల్ ఖలీని తీవ్రంగా గాయపర్చిన సంగతి తెలిసిందే. స్టీల్ తోపాటు అతని సహచరులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో తలకు, చేతికి గాయాలైన ఖలీ ఐసీయూలో ఉండి చికిత్స పొందాడు.

ఈ సందర్బంగా తనపై దాడికి దిగిన రెజర్లను చిత్తుగా ఓడించి దెబ్బకు దెబ్బ తీస్తానని ఖలీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 'ది గ్రేట్ ఖలీ షో' పేరిట ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఈ కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన మ్యాచుకు ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్ ఉపాధ్యాయ్ హాజరై తిలకించారు.

7.1 అడుగుల ఎత్తుతో మాంఛి బలిష్టంగా ఉండే ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్‌ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement