Brody Steel
-
వీడియో: ఖలీ పగ తీర్చుకున్నాడిలా..!
న్యూఢిల్లీ: రెజ్లింగ్ మ్యాచులో తనపై తీవ్రంగా దాడి చేసిన ప్రత్యర్థులను చిత్తుచేసి ది గ్రేట్ ఖలీ పగ తీర్చుకున్నాడు. ఆదివారం డెహ్రాడూన్‌లో జరిగిన రెజ్లింగ్ మ్యాచులో ఖలీ వీరవిహారం చేశాడు. తలకు బ్యాండెడ్ కట్టుకొని రింగులోకి దిగిన ఖలీ కెనడా రెజర్లపై భారీ పంచులు కురిపించాడు. ప్రధాన ప్రత్యర్థి అయిన బ్రాడీ స్టీల్‌ను చిత్తుగా ఓడించాడు. 'ది గ్రేట్ ఖలీ షో' పేరిట ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నాయి. అంతకుముందు జరిగిన మ్యాచులో కెనడియన్ రెజ్లర్ బ్రాడీ స్టీల్ ఖలీని తీవ్రంగా గాయపర్చిన సంగతి తెలిసిందే. స్టీల్, అతని సహచరులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో తలకు, చేతికి గాయాలైన ఖలీ ఐసీయూలో ఉండి చికిత్స పొందాడు. గాయాల నుంచి కోలుకొని ఆదివారం రింగులోకి దిగిన ఖలీ ప్రత్యర్థులపై దాడి చేసే దృశ్యాలతోపాటు.. అంతకుముందు అతనిపై కెనడా రెజర్లు విరుచుకుపడిన దృశ్యాలు కూడా ఈ వీడియోలో చూడొచ్చు. 7.1 అడుగుల ఎత్తుతో మాంఛి బలిష్టంగా ఉండే ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించాడు. -
ప్రత్యర్థిని చిత్తుచేసి పగ తీర్చుకున్న ఖలీ
డెహ్రాడూన్: డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ సూపర్ స్టార్ ది గ్రేట్ ఖలీ తనపై దాడిచేసిన ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆదివారం జరిగిన మ్యాచులో కెనడా రెజ్లర్ బ్రాడీ స్టీల్ ను చిత్తుగా ఓడించి తన సత్తా చాటాడు. డెహ్రాడూన్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి కిక్కిరిసిన అభిమానుల మధ్య ఖలీ వీరవిహారం చేశాడు. ఐదు రోజుల కిందట జరిగిన మ్యాచులో కెనడియన్ రెజ్లర్ బ్రాడీ స్టీల్ ఖలీని తీవ్రంగా గాయపర్చిన సంగతి తెలిసిందే. స్టీల్ తోపాటు అతని సహచరులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో తలకు, చేతికి గాయాలైన ఖలీ ఐసీయూలో ఉండి చికిత్స పొందాడు. ఈ సందర్బంగా తనపై దాడికి దిగిన రెజర్లను చిత్తుగా ఓడించి దెబ్బకు దెబ్బ తీస్తానని ఖలీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 'ది గ్రేట్ ఖలీ షో' పేరిట ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఈ కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన మ్యాచుకు ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్ ఉపాధ్యాయ్ హాజరై తిలకించారు. 7.1 అడుగుల ఎత్తుతో మాంఛి బలిష్టంగా ఉండే ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించాడు.