రూ. 150 కోట్లలో మీ వాటా ఎంత? యంగ్ హీరోకు నెటిజన్​ ప్రశ్న.. | Kartik Aaryan Reveals His Share In Bhool Bhulaiyaa 2 Profits | Sakshi
Sakshi News home page

రూ. 150 కోట్లలో మీ వాటా ఎంత? యంగ్ హీరోకు నెటిజన్​ ప్రశ్న..

Published Wed, Jun 8 2022 1:53 PM | Last Updated on Fri, Jun 10 2022 5:07 PM

Kartik Aaryan Reveals His Share In Bhool Bhulaiyaa 2 Profits - Sakshi

Kartik Aaryan Reveals His Share In Bhool Bhulaiyaa 2 Profits: బాలీవుడ్​ చాక్లెట్​ బాయ్​ కార్తీక్ ఆర్యన్​ ఇటీవల నటించి సూపర్​ హిట్​ కొట్టిన చిత్రం 'భూల్​ భులయ్యా 2'. కియరా అద్వానీ, టబు నటించిన ఈ సీక్వెల్​ మూవీ బాలీవుడ్​ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్​ తర్వాత సక్సెస్​ రుచి చూపించింది. మే 20న విడుదలై ఈ సినిమా సుమారు రూ. 150 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమచారం. ఇప్పుడు ఈ సినిమా విజయాన్ని పూర్తిగా ఎంజాయ్​ చేస్తున్నాడు కార్తీక్​ ఆర్యన్​. తాజాగా 'ఆస్క్​మీ కార్తీక్'​ అనే సెషన్​ను సోషల్​ మీడియా వేదికగా నిర్వహించాడు. 

ఈ సెషన్​లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు కార్తీక్. 'మిస్టర్​ మోస్ట్ ఎలిజబుల్​ బ్యాచ్​లర్​ కార్తీక్​.. పెళ్లిపై మీ ప్లాన్స్ ఏంటీ ?' అని అడిగిన ప్రశ్నకు 'ముందు నన్ను ఒక రిలేషన్​షిప్​లోకి వెళ్లనివ్వండి. ఆ తర్వాత పెళ్లి గురించి మాట్లాడుకుందాం. నేను సింగిల్​గానే ఉండిపోతానేమో అనిపిస్తుంది.' అని తెలిపాడు. 

చదవండి: చిరంజీవి బయోపిక్ గురించి నేను అలా అనలేదు​: సీనియర్​ నటుడు


అనంతరం మరోకొరు 'సర్​.. భూల్​ భులయ్యా 2 సినిమాకు రూ. 150 కోట్ల లాభం వచ్చింది కదా. అందులో మీ వాటా ఎంత?' అని అడగ్గా.. 'ఆ లాభాల్లో నేను ఎలాంటి వాటా తీసుకోలేదు. ఈ సినిమా వల్ల నాకు అభిమానుల నుంచి విపరీతమైన ప్రేమ దొరికింది. డబ్బు కంటే ఆ ప్రేమ గొప్పది.' అని సమాధానమిచ్చాడు. అలాగే 'మీకిష్టమైన మార్వెల్​ క్యారెక్టర్​ ఏంటీ?' అన్న ప్రశ్నకు 'స్పైడీ' అని పేర్కొన్నాడు. 

చదవండి: మన పిల్లలకైనా ఆ సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్​

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement