ఘోర ప్రమాదం.. స్పాట్‍‌లో చనిపోయిన స్టార్ హీరో బంధువులు | Kartik Aaryan Relatives Tragically Died In Mumbai Ghatkopar Hoarding Collapse Incident, Details Inside | Sakshi
Sakshi News home page

Karthik Aryan: హోర్డింగ్ కుప్పకూలిన ఘటన.. యంగ్ హీరో ఇంట్లో విషాదం

Published Fri, May 17 2024 2:01 PM | Last Updated on Fri, May 17 2024 5:17 PM

Kartik Aaryan Relatives Died In Mumbai Hoarding Collapse Incident

బాలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ ఇంట్లో విషాదం నెలకొంది. రీసెంట్‌గా ముంబైలో భారీ హోర్డింగ్ కుప్పకూలిన ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతోంది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోగా, 40 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో మృతి చెందిన వాళ్లలో హీరో బంధువులు కూడా ఉన్నారు. తాజాగా వాళ్ల అంత్యక్రియలకు సదరు హీరో హాజరు కావడంతో ఈ విషయం బయటపడింది. ఇంతకీ అసలేం జరిగింది?

(ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా)

సోమవారం సాయంత్రం మంబయిలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలోనే ఘాట్‌కోపర్ ప్రాంతంలో సుమారు 250 టన్నులు బరువున్న హోర్డింగ్ ఓ పెట్రోల్ బంకుపై కుప్పకూలింది. దాంతో దాని కింద 100 మంది చిక్కుకుపోయారు. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు. వీళ్లలో హీరో కార్తిక్ ఆర్యన్ అంకుల్ మనోజ్ చన్సోరియా(60), ఆంటీ అనిత (59) కూడా ఉన్నారు.

తాజాగా వీళ్లిద్దరికీ అంత్యక్రియలు జరగ్గా.. కార్తిక్ ఆర్యన్ హాజరయ్యాడు. తన బంధువులకు తుది నివాళులు అర్పించాడు. ఇకపోతే హోర్డింగ్ కుప్పకూలిన కేసులో నిందితుడు భవేశ్ పాండేని పోలీసులు అరెస్ట్ చేశారు. భవేశ్ అత్యాశ, అధికారుల నిర్లక్ష‍్యమే ఈ ప్రమాదానికి కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనలో సహాయక చర్యలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

(ఇదీ చదవండి: ఆ డైరెక్టర్‌ నన్ను చంపుతానని బెదిరించాడు.. నా వెంటే ఎయిర్‌పోర్టుకు..: నటి లయ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement