marriage plans
-
రూ. 150 కోట్లలో మీ వాటా ఎంత? యంగ్ హీరోకు నెటిజన్ ప్రశ్న..
Kartik Aaryan Reveals His Share In Bhool Bhulaiyaa 2 Profits: బాలీవుడ్ చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్ ఇటీవల నటించి సూపర్ హిట్ కొట్టిన చిత్రం 'భూల్ భులయ్యా 2'. కియరా అద్వానీ, టబు నటించిన ఈ సీక్వెల్ మూవీ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ రుచి చూపించింది. మే 20న విడుదలై ఈ సినిమా సుమారు రూ. 150 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమచారం. ఇప్పుడు ఈ సినిమా విజయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. తాజాగా 'ఆస్క్‌మీ కార్తీక్' అనే సెషన్‌ను సోషల్ మీడియా వేదికగా నిర్వహించాడు. ఈ సెషన్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు కార్తీక్. 'మిస్టర్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ కార్తీక్.. పెళ్లిపై మీ ప్లాన్స్ ఏంటీ ?' అని అడిగిన ప్రశ్నకు 'ముందు నన్ను ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్లనివ్వండి. ఆ తర్వాత పెళ్లి గురించి మాట్లాడుకుందాం. నేను సింగిల్‌గానే ఉండిపోతానేమో అనిపిస్తుంది.' అని తెలిపాడు. చదవండి: చిరంజీవి బయోపిక్ గురించి నేను అలా అనలేదు: సీనియర్ నటుడు Eligible se taken toh karao phir marriage ki baat karenge. Eligible eligible mein single hi reh jaoonga #AskKartik https://t.co/eHYs2dStj4 — Kartik Aaryan (@TheAaryanKartik) June 7, 2022 అనంతరం మరోకొరు 'సర్.. భూల్ భులయ్యా 2 సినిమాకు రూ. 150 కోట్ల లాభం వచ్చింది కదా. అందులో మీ వాటా ఎంత?' అని అడగ్గా.. 'ఆ లాభాల్లో నేను ఎలాంటి వాటా తీసుకోలేదు. ఈ సినిమా వల్ల నాకు అభిమానుల నుంచి విపరీతమైన ప్రేమ దొరికింది. డబ్బు కంటే ఆ ప్రేమ గొప్పది.' అని సమాధానమిచ్చాడు. అలాగే 'మీకిష్టమైన మార్వెల్ క్యారెక్టర్ ఏంటీ?' అన్న ప్రశ్నకు 'స్పైడీ' అని పేర్కొన్నాడు. చదవండి: మన పిల్లలకైనా ఆ సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్ 150 cr mein profit nahi Fans ka pyaar mila hai !! Koi number usse bada nahin hota ❤️#AskKartik https://t.co/FDge180zsK — Kartik Aaryan (@TheAaryanKartik) June 7, 2022 Spidey 🕷 #AskKartik https://t.co/wuyJoK21o1 — Kartik Aaryan (@TheAaryanKartik) June 7, 2022 -
తాప్సీ పెళ్లి కండీషన్లు, కష్టమేనంటున్న పేరెంట్స్!
Tapsee Pannu: బాలీవుడ్లో సత్తా చాటుతున్న తాప్సీ ఒకప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్గా వెలుగొందింది. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న తాప్సీకి ఇక తిరుగులేదు అనుకుంటున్న సమయంలో బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడే తన యాక్టింగ్‌కు మరింత పదును పెడుతూ వుమెన్ ఓరియంటెడ్ సినిమాలను కూడా చేస్తూ సత్తా చాటుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు ఎలాంటి భర్త కావాలి? ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది? అన్న విషయాల గురించి స్పందించింది. తను వేలు పట్టి నడిచేవాడు తన మనసుకు మాత్రమే నచ్చితే సరిపోతదని, తల్లిదండ్రులకు కూడా నచ్చాలంది. వాళ్లతో కలివిడిగా ఉండాలని, అలాంటి అబ్బాయితోనే ఏడడుగులు నడుస్తానని కరాఖండిగా చెప్పింది. అంతే కాదు తాను డేట్ చేసినవారితో కూడా ఈ విషయాన్ని ముందే చెప్పానని తెలిపింది. రిలేషన్షిప్ కోసం సమయం కేటాయిస్తానంటున్న తాప్సీ అనవసరంగా టైంపాస్ మాత్రం చేయనని స్పష్టం చేసింది. అయితే తానింకా అనుకున్న స్థాయిని అందుకోలేదంటోంది తాప్సీ. ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తుంటే టైం అనేదే ఉండదని, కేవలం రెండు సినిమాలతో సరిపెట్టుకునే స్థాయికి వచ్చినప్పుడే వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించగలను అని పేర్కొంది. అయితే ఇలా కండీషన్స్ పెట్టుకుంటూ పోతే తనెక్కడ పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతుందోనని ఆందోళన చెందుతున్నారట తాప్సీ పేరెంట్స్. -
పెళ్లికి డబ్బులు కూడబెట్టుకుంటున్నాం!
కోలీవుడ్ లవ్‌బర్డ్స్ విఘ్నేశ్ శివన్, నయనతార ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? విఘ్నేశ్ ఫేవరెట్ హీరోయిన్ నయనతార కాదు.. మరి ఎవరు? నయనకు విఘ్నేశ్ ఇచ్చిన తొలి బహుమతి ఏంటి?... ఇలాంటి ఆసక్తికరమైన నెటిజన్ల ప్రశ్నలకు విఘ్నేశ్ శివన్ సరదాగా క్లారిటీ ఇచ్చారు. కాబోయే భార్య నయనతార గురించి విఘ్నేశ్ శివన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చదివేయండి. ♦నేనొక దర్శక నిర్మాత అయినప్పటికీ నెటిజన్లు ఎక్కువగా నా విషయాలను కాకుండా నయనతార గురించే ప్రస్తావించడం నాకు అసూయగా లేదు. నిజం చెప్పాలంటే చాలా గర్వంగా ఉంది. ♦నయనతారతో కలిసి నాకూ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఉంది. కానీ ఈ విషయంలో తనవైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. ♦మా డిన్నర్‌ను కంప్లీట్ చేసిన తర్వాత రోజూ నయనతారే ఆ పాత్రలను శుభ్రపరుస్తుంది. ఘీ రైస్, చికెన్ కర్రీ బాగా వండుతుంది తను. ♦నయనతార నటించిన చిత్రాల్లో ‘రాజా–రాణి’ నా ఫేవరెట్ ♦నయనతో నేను కలిసి ఉన్న ప్రతీ ప్లేస్ నా ఫేవరెట్ స్పాటే. ♦నా ఫేవరెట్ హీరోయిన్ మోనికా బెల్లూచి (ఇటాలియన్ నటి). ♦నయనతార చాలా అందంగా ఉండటానికి ఆమె చేస్తున్న ప్రార్థనలే ముఖ్య కారణం ♦నయన నటించిన ‘నానుమ్ రౌడీదాన్’ చిత్రంలో ‘తంగమే’ (బంగారమే...) పాటకు లిరిక్స్ రాశాను. ఆమెకు నేను ఇచ్చిన తొలి బహుమతి ఈ పాట అని అనుకుంటాను. ♦పెళ్లంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకే డబ్బులు కూడబెడుతున్నాం. అలాగే కరోనా పరిస్థితులు పూర్తిగా సమసిపోయిన తర్వాత నేను, నయన వివాహం చేసుకోవాలనుకుంటున్నాం. ♦నా లైఫ్‌లో నయనతార తల్లి కురియన్ వన్నాఫ్ ది బెస్ట్ పర్సన్స్. ♦వెస్ట్రన్ డ్రెస్సింగ్ స్టైల్లో కన్నా నయనతార చీరకట్టులోనే చాలా బాగుంటుంది. ♦నేను దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమా ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ షూటింగ్ ఇంకా 15 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. (ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు). చదవండి: (చూపు కోల్పోయిన కత్తి మహేశ్?) -
నా ప్రియురాలి పేరెంట్స్‌ను ఎలాగైనా ఒప్పిస్తా
హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్ గ్రాండ్ ఫినాలే ఆదివారం(ఫిబ్రవరి 21) అంగరంగా వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాహుల్ వైద్యను వెనక్కు నెట్టి రుబీనా దిలైక్ విజేతగా అవతరించింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై అభినందనల వర్షం కురుస్తోంది. తన కలను నిజం చేసిన అభిమానులకు ఆమె వేవేల కృతజ్ఞతలు తెలిపింది. రాఖీ సావంత్, నిక్కీ తంబోళిలతో పాటు టాప్ 5లోకి అడుగుపెట్టిన అలీ గొని మూడో రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అతడికి ఎక్కడికి వెళ్లినా పెళ్లెప్పుడు అన్న ప్రశ్న ఎదురవుతోంది. ఈ క్రమంలో తన పెళ్లి గురించి అలీ స్పందిస్తూ.. "అసలు నేను బిగ్‌బాస్ షోకు వెళ్లిందే నా స్నేహితురాలు జాస్మిన్ను ఎంకరేజ్ చేసేందుకు. కానీ అక్కడకు వెళ్లాక అర్థమైంది ఆమె పూర్తిగా నా మనిషి అని, నా కోసమే పుట్టిందని! ఆ విషయం అర్థమయ్యాక ఆమెతో టైమ్ స్పెండ్ చేసేందుకు మరీమరీ ఎదురు చూస్తున్నా. అంతా కలిసొస్తే తనను తప్పకుండా పెళ్లి చేసుకుంటా. అలా అని ఆమెను ఇప్పుడప్పుడే వివాహానికి తొందర పెట్టను. కానీ భవిష్యత్తులో మాత్రం జాస్మిన్ తల్లిదండ్రులను ఎలాగైనా ఒప్పించి మరీ ఆమెను నాదాన్ని చేసుకుంటాను" అని చెప్పుకొచ్చాడు. మూడేళ్లుగా స్నేహగీతం పాడిన ఈ ఇద్దరూ ఎట్టకేలకు పెళ్లికి రెడీ అవుతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బిగ్‌బాస్ విన్నర్‌గా రుబీనా, ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా? -
పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నటి..
భోజ్‌పురి నటి రాణి చటర్జీ తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టెలివిజన్ రంగానికి చెందిన తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకోనున్నట్టు తెలిపారు. ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్లో తాము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. కానీ ఇంకా తేదీపై నిర్ణయం తీసుకోలేదని అన్నారు. కొంత కాలంగా తన బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే తన బాయ్‌ఫ్రెండ్ ఎవరనేది మాత్రం రాణి రహస్యంగా ఉంచారు. అతని గుర్తింపును ఇప్పుడు వెల్లడించలేనని.. కానీ తొందరలోనే వివరాలు చెబుతానని అన్నారు. అలాగే వెడ్డింగ్ ప్లాన్స్ గురించి ఆమె మాట్లాడుతూ.. ముస్లిం సంప్రాదాయం ప్రకారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నామని అన్నారు. కాగా, ససురా బడా పైసావాలా సినిమాతో రాణి భోజ్‌పురి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత దేవ్రా బడా సతవేల, ఏక్ లైలా తీన్ చైలా, నాగిన్, రాణి చాలీ సాసురల్, దులారా.. వంటి హిట్ చిత్రాల్లో నటించారు. అలాగే భోజ్‌పురిలో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. -
మా పెళ్లిళ్ల గురించి మీకెందుకు?
బాలీవుడ్లో అత్యంత ముదురు బ్రహ్మచారిగా ముద్రపడిన సల్మాన్ ఖాన్‌కు నిత్యం ఎదురయ్యే ప్రశ్న.. 'మీకు పెళ్లి ఎప్పుడు'. ఆయన కార్యక్రమానికి వెళ్లినా.. ఎక్కడ కనిపించినా.. అభిమానులు, మీడియా ప్రతినిధులు పదేపదే అడిగే ప్రశ్న ఇది. ఇప్పుడు ఇదే తరహా ప్రశ్న మరో బాలీవుడ్ సెలబ్రిటీని వెంటాడుతోంది. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు.. మన హైదరాబాద్ ముద్దుగుమ్మ టబునే. తెలుగులో ఎన్నో సినిమాలతో అదరగొట్టిన ఈ అమ్మడు ఇప్పుడు 'గోల్మాల్ అగైన్'తో మళ్లీ ప్రేక్షకులను పలుకరించబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఈ సీనియర్ నటికి తరచూ ఎదురవుతున్న ఓ ప్రశ్న చికాకు తెప్పిస్తోందట. అదేమిటంటే.. ఎక్కడికి వెళ్లినా విలేకరులు, జనాలు 'మీ పెళ్లెప్పుడు' అని ప్రశ్నిస్తున్నారట. తాజాగా 'నవభారత్ టైమ్స్'కు ఇంటర్వ్యూ ఇచ్చిన టబు ఈ విషయాన్ని తెలిపింది. పెళ్లి చేసుకొనే ఆలోచన ఎంతవరకు వచ్చిందంటూ పదేపదే అడుగుతుండటం.. చాలా చిరాకు తెప్పిస్తున్నదని, దీంతో మీ పని మీరు చూసుకొండి.. నా పెళ్లి గురించి అడగకండి అని అనాల్సి వస్తున్నదని టబు తెలిపింది. సల్మాన్ ఖాన్, తన పెళ్లిళ్ల గురించి జనాలు ఎక్కువ ఆందోళన పడుతున్నట్టు కనిపిస్తున్నదని ఆమె పేర్కొంది. 'సల్మాన్, నా పెళ్లిల గురించి ప్రతి ఒక్కరూ వర్రీ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఒకే ప్రశ్న పదేపదే అడుగుతుండటంతో విసిగిపోయాను. మరొకటి ఏదైనా కొత్తది అడగొచ్చు కదా' అని కోరుతోంది టబు. -
అదో తీయని అనుభవం
‘ నాకు ప్రేమకు వేళైంది. ఇక ఆ అనుభవాన్ని చవిచూడాలనే నిర్ణయానికి వచ్చాను. ప్రేమను వర్ణించడం సాధ్యం కాదు. అదో తీయని అనుభవం.’ ఇలా అన్నది ఎవరనుకుంటున్నారు ఇంకెవరు చెల్లెలి పెళ్లి చేసి తాను మాత్రం ఇంకా ఒంటరి జీవితాన్నే గడిపేస్తూ నటనను ఎంజాయ్ చేస్తున్న నటి కాజల్‌అగర్వాలే. మార్కెట్ డౌన్ అయ్యింది ఇక మూటాముల్లె సర్దేసుకుని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో మునిగిపోదాం అన్న నిర్ణయానికి వచ్చేసిన తరుణంలో అనూహ్యంగా అవకాశాలు ముంచెత్తడంతో పెళ్లి ఆలోచనను వాయిదా వేసుకుని బిజీగా నటిస్తున్న కాజల్ ఆలోచనలు తాజాగా మరోసారి ప్రేమపైకి మళ్లినట్లున్నాయి. ఈ మధ్య ఈ బ్యూటీ నోట పదే పదే ప్రేమ మాట వినిపిస్తోంది. ఇటీవల కాజల్ ఒక భేటీలో పేర్కొన్న అంశాలను చూద్దాం. ‘ఆడవారి విషయంలో మగవారి ఆలోచనాధోరణి మారాలి.ఎందుకంటే మహిళలు పురుషులతో సమానంగానే కాదు వారికంటే అధికంగా సంపాదిస్తున్నారు. పాత కాలంలో మాదిరి ఇంటి పనులు చేయాలని మహిళల్ని పురుషులు ఒత్తిడి చేయకూడదు. అంతే కాదు వారూ ఇంటి పనులు చేయాలి. ఇక ప్రేమ విషయానికి వస్తే అది వర్ణించడానికి కాని తీయని అనుభవం. ఇప్పటి వరకూ నేనెవరినీ ప్రేమించలేదు. అయితే ఇక ప్రేమించాలన్న నిర్ణయానికి వచ్చాను. ప్రేమించడానికి ఏ రాజకుమారుడో అక్కర్లేదు. ఎవరైనా నాకు ఆక్షేపణ తేదు. నాకు తగిన జోడీ అయితే చాలు. అతనికి ఎలాంటి లక్షణాలు ఉండాలని మీరు అడగవచ్చు. నా భావాలను అర్థం చేసుకునేవాడై ఉండాలి. నా ఆలోచనలు గౌరవించాలి. నాపై పూర్తిగా నమ్మకం ఉంచాలి. తను సొంత జీవితం కంటే నా జీవితానికి ప్రాముఖ్యతనివ్వాలి. నా అవసరాలను పూర్తి చేయాలి. అలాంటి వ్యక్తినే నేను ప్రేమిస్తాను. నేనూ సాధారణ అమ్మాయినే. నాకూ కలలు, కోరికలు ఉంటాయి కదా’ అన్న కాజల్ తెలుగు చిత్రం జనతా గ్యారేజ్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో దు మ్మురేపారంటున్నాయి సినీ వర్గాలు. -
సరైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటా: రాహుల్
కాంగ్రెస్ పార్టీ 'యువరాజు' పెళ్లిపై గత కొద్దికాలంగా ఎడతెగని చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తన పెళ్లి గురించి రాహుల్ మనసులో మాట బయటపెట్టారు. తనకు సరిపోయే అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని వార్తా ఏజెన్సీకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రతిసారి ఇదే ప్రశ్న ఎదురవుతోంది.. ప్రస్తుతం నేను ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాను. నా వ్యక్తిగత జీవితం మీద దృష్టి పెట్టే సమయం లేదు అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. సరియైన అమ్మాయి దొరక్కగానే పెళ్లి చేసుకుంటాను. మరో సంవత్సరం లేదా, మరో రెండు సంవత్సరాలు పట్టవచ్చు. అని ఓ ప్రశ్నకు రాహుల్ బదులిచ్చారు. తనకు బాలీవుడ్ సినిమాలంటే ఆసక్తి లేదని.. తన సోదరి ప్రియాంక హిందీ సినిమాలు ఎక్కువగా చూస్తుందని అన్నారు. అలాగే తనకు అభిమాన తారలేవరూ లేరని.. ఫెర్మార్మెన్స్ ప్రాధాన్యత ఇస్తానని రాహుల్ చెప్పారు.