బాలీవుడ్‌లో అత్యంత ముదురు బ్రహ్మచారిగా ముద్రపడిన సల్మాన్ ఖాన్‌కు నిత్యం ఎదురయ్యే ప్రశ్న.. 'మీకు పెళ్లి ఎప్పుడు'. ఆయన కార్యక్రమానికి వెళ్లినా.. ఎక్కడ కనిపించినా.. అభిమానులు, మీడియా ప్రతినిధులు పదేపదే అడిగే ప్రశ్న ఇది. ఇప్పుడు ఇదే తరహా ప్రశ్న మరో బాలీవుడ్ సెలబ్రిటీని వెంటాడుతోంది.
ఆ సెలబ్రిటీ ఎవరో కాదు.. మన హైదరాబాద్ ముద్దుగుమ్మ టబునే. తెలుగులో ఎన్నో సినిమాలతో అదరగొట్టిన ఈ అమ్మడు ఇప్పుడు 'గోల్‌మాల్ అగైన్'తో మళ్లీ ప్రేక్షకులను పలుకరించబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఈ సీనియర్ నటికి తరచూ ఎదురవుతున్న ఓ ప్రశ్న చికాకు తెప్పిస్తోందట. అదేమిటంటే.. ఎక్కడికి వెళ్లినా విలేకరులు, జనాలు 'మీ పెళ్లెప్పుడు' అని ప్రశ్నిస్తున్నారట.
తాజాగా 'నవభారత్ టైమ్స్'కు ఇంటర్వ్యూ ఇచ్చిన టబు ఈ విషయాన్ని తెలిపింది. పెళ్లి చేసుకొనే ఆలోచన ఎంతవరకు వచ్చిందంటూ పదేపదే అడుగుతుండటం.. చాలా చిరాకు తెప్పిస్తున్నదని, దీంతో మీ పని మీరు చూసుకొండి.. నా పెళ్లి గురించి అడగకండి అని అనాల్సి వస్తున్నదని టబు తెలిపింది.
సల్మాన్ ఖాన్, తన పెళ్లిళ్ల గురించి జనాలు ఎక్కువ ఆందోళన పడుతున్నట్టు కనిపిస్తున్నదని ఆమె పేర్కొంది. 'సల్మాన్, నా పెళ్లిల గురించి ప్రతి ఒక్కరూ వర్రీ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఒకే ప్రశ్న పదేపదే అడుగుతుండటంతో విసిగిపోయాను. మరొకటి ఏదైనా కొత్తది అడగొచ్చు కదా' అని కోరుతోంది టబు.
Comments
Please login to add a commentAdd a comment