తాప్సీ పెళ్లి కండీషన్లు, కష్టమేనంటున్న పేరెంట్స్‌! | Taapsee Pannu Reveals About Her Marriage Plans | Sakshi
Sakshi News home page

Taapsee Pannu: తాప్సీ పెళ్లి కండీషన్స్‌, టైంపాస్‌ చేయదట!

Jul 9 2021 4:17 PM | Updated on Jul 9 2021 5:49 PM

Taapsee Pannu Reveals About Her Marriage Plans - Sakshi

తను వేలు పట్టి నడిచేవాడు తన మనసుకు మాత్రమే నచ్చితే సరిపోతదని, తల్లిదండ్రులకు కూడా నచ్చాలంది...

Tapsee Pannu: బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న తాప్సీ ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న తాప్సీకి ఇక తిరుగులేదు అనుకుంటున్న సమయంలో బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడే తన యాక్టింగ్‌కు మరింత పదును పెడుతూ వుమెన్‌ ఓరియంటెడ్‌ సినిమాలను కూడా చేస్తూ సత్తా చాటుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు ఎలాంటి భర్త కావాలి? ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది? అన్న విషయాల గురించి స్పందించింది.

తను వేలు పట్టి నడిచేవాడు తన మనసుకు మాత్రమే నచ్చితే సరిపోతదని, తల్లిదండ్రులకు కూడా నచ్చాలంది. వాళ్లతో కలివిడిగా ఉండాలని, అలాంటి అబ్బాయితోనే ఏడడుగులు నడుస్తానని కరాఖండిగా చెప్పింది. అంతే కాదు తాను డేట్‌ చేసినవారితో కూడా ఈ విషయాన్ని ముందే చెప్పానని తెలిపింది. రిలేషన్‌షిప్‌ కోసం సమయం కేటాయిస్తానంటున్న తాప్సీ అనవసరంగా టైంపాస్‌ మాత్రం చేయనని స్పష్టం చేసింది.

అయితే తానింకా అనుకున్న స్థాయిని అందుకోలేదంటోంది తాప్సీ. ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తుంటే టైం అనేదే ఉండదని, కేవలం రెండు సినిమాలతో సరిపెట్టుకునే స్థాయికి వచ్చినప్పుడే వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించగలను అని పేర్కొంది. అయితే ఇలా కండీషన్స్‌ పెట్టుకుంటూ పోతే తనెక్కడ పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతుందోనని ఆందోళన చెందుతున్నారట తాప్సీ పేరెంట్స్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement