కార్తిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌కు అమ్మాయిలు ఫిదా | Kartik Aaryan New Look Is Stealing Hearts | Sakshi
Sakshi News home page

కొత్త లుక్‌తో కవ్విస్తున్న కార్తిక్‌ ఆర్యన్‌

Published Fri, Nov 6 2020 8:18 PM | Last Updated on Fri, Nov 6 2020 8:28 PM

Kartik Aaryan New Look Is Stealing Hearts - Sakshi

నటీనటులు ఎప్పుడూ ఒకేలా ఉంటే ఫ్యాన్స్‌కి కూడా బోర్‌ కొట్టేస్తుందిగా.. అందుకే అభిమాన హీరో, హీరోయిన్లకు సంబంధించి కొత్త లుక్‌తో ఒక్క ఫోటో రిలీజ్‌ అవ్వగానే దానికి కామెంట్లు, షేర్లు వరదల్లా వచ్చి పడుతుంటాయి. అందుకే ఫ్యాన్స్‌ను ఎప్పటికప్పుడు ఎలా ఎంటర్‌టైన్‌ చేయాలా అనే ఆలోచిస్తుంటారు నటీనటులు. బాలీవుడ్‌లో ఈ ధోరణి మరీ ఎక్కువగా ఉంటుంది. పైగా యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే లాక్‌డౌన్‌ సమయంలో ఫ్యాన్స్‌కు బోర్‌ కొట్టకుండా ఎప్పటికప్పుడు తన సోషల్‌ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్‌ చేయడమే కాదు లైవ్‌లు పెట్టి వారితో మాట్లాడేవాడు కూడా.     చదవండి: (యశ్‌తో భారీ‌ మల్టీస్టారర్‌కు శంకర్‌ ప్లాన్‌‌)

ఇటీవల జుట్టు పెంచుకున్నకార్తీక్‌ ఆర్యన్‌ కొత్త మేక్‌ ఓవర్‌తో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘కళ్లే మాట్లాడతాయి’ అంటూ క్యాప్షన్‌ పెట్టాడు. ఈ సన్‌ కిస్స్‌డ్‌ సెల్ఫీలో కార్తీక్‌ సింపుల్‌గా ఒక టీ షర్ట్‌తో ఉన్నా తన డాషింగ్‌ లుక్‌ మాత్రం నెటిజన్లను కట్టిపడేస్తోంది. పెరిగిన జుట్టుతో, గడ్డంతో కార్తీక్‌ మునుపటి కంటే ఎక్కువ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. కార్తీక్‌ ఆర్యన్‌ చివరగా 2019 డిసెంబర్‌లో విడుదలైన ‘పతి పత్నీ ఔర్‌ వో’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.    చదవండి:  (13 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి బొమ్మరిల్లు)

1978లో సంజీవ్‌ కుమార్‌, విద్యా సిన్హా, రంజితా కౌర్‌ నటించిన సినిమాకు ఇది రీమేక్‌. ఇందులో కార్తీక్‌ భూమీ పెడ్నేకర్‌, అనన్య పాండేతో జతకట్టాడు. ఈ సినిమా మరీ హిట్‌ టాక్‌ సాధించకపోయినా బాక్సాఫీస్‌ దగ్గర పర్వాలేదనిపించింది. కార్తీక్‌ తర్వాత చిత్రం ‘దోస్తానా2’లో మళ్లీ ఇద్దరు హీరోయిన్లతో ఆడిపాడనున్నాడు. ఈ సినిమాలో తనకు జంటగా జాన్వీ కపూర్‌, లక్ష్య నటించనున్నారు. 

Let the eyes do the talking

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement