Kartik Aaryan Attends His Bodyguard Wedding Today Photos Viral - Sakshi
Sakshi News home page

బాడీగార్డ్ పెళ్లిలో స్టార్ హీరో సందడి.. ఫోటోలు వైరల్

Published Mon, May 1 2023 4:30 PM | Last Updated on Mon, May 1 2023 4:46 PM

Kartik Aaryan attends his bodyguard wedding Today Photos Viral - Sakshi

బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ పెళ్లిలో సందడి చేశారు. తన బాడీగార్డ్ సచిన్ వివాహానికి హాజరయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. 'కంగ్రాట్స్.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సచిన్ అండ్ సురేఖ' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కార్తీక్ ఆర్యన్‌ పోస్ట్‌పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు. 

(ఇది చదవండి: నా సర్వస్వం నువ్వే.. ఎప్పుడూ నీ చేయి వీడను: కోహ్లి ట్వీట్‌ వైరల్‌)

కాగా.. కార్తీక్ చివరిసారిగా రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ చిత్రం తూ ఝూతి మైన్ మక్కర్‌లో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించాడు. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో హిందీ రీమేక్ అయిన షెహజాదా చిత్రంలో కార్తీక్, కృతి సనన్‌ జంటగా నటించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది.

ప్రస్తుతం కార్తీక్ సత్యప్రేమ్ కి కథలో కియారా అద్వానీతో కలిసి నటించనున్నారు. సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత ఆషికీ -3లో నటించనున్నారు. 

(ఇది చదవండి: చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది.. డ్యాన్స్‌ మాస్టర్‌ మేనమామ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement