సాక్షి, ముంబై: పాదరక్షల తయారీ కంపెనీ బాటా ఇండియాకు కొత్త ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నియమితులయ్యారు. యువతలో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న నటుడిని ప్రచారకర్తగా ఎన్నుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని కంపెనీ తెలిపింది. టెలివిజన్, డిజిటల్‌తో పాటు ఇతర మాధ్యమాల ప్రకటనల ద్వారా కార్తీక్ కంపెనీ నాణ్యమైన, సరికొత్త ఉత్పత్తుల గురించి ప్రచారం చేస్తారని వివరించింది.
తమ పోర్ట్‌ఫోలియోను మరింత ఆకర్షణీయంగా మార్చడం ద్వారా బ్రాండ్‌ను మారుస్తున్నామని బాటా ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్-మార్కెటింగ్ ఆనంద్ నారంగ్ చెప్పారు. కార్తీక్ ఆర్యన్ లాంటి పాజిటివ్ ఎనర్జీ, ఈజీగోయింగ్ అప్రోజ్ యూత్‌ను ఆకట్టుకుంటుందని, కార్తీక్‌తో అనుబంధం ద్వారా యువతతో తమ సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తోడ్పడుతుందన్నారు. ముఖ్యంగా బాటా రెడ్ లేబుల్, నార్త్ స్టార్, పవర్ హుష్ పప్పీస్ లాంటి యువబ్రాండ్‌లను తెరపైకి తీసుకు రావడానికి సహాయపడుతుందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment