BATA
-
బాటా ఇండియా మెరుగైన పనితీరు
న్యూఢిల్లీ: బాటా ఇండియా సెపె్టంబర్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. లాభం 53 శాతానికి పైగా పెరిగి రూ.52 కోట్లకు చేరింది. ఆదాయం మాత్రం 2 శాతానికి పైగా వృద్ధితో రూ.837 కోట్లుగా నమోదైంది. ఎబిట్డా లాభం స్థిరంగా ఉండడం నిర్వహణ సామర్థ్యాల బలాన్ని తెలియజేస్తున్నట్టు బాటా ఇండియా ప్రకటించింది. ఉత్పత్తుల ఆవిష్కరణ, కస్టమర్లకు మెరుగైన అనుభవం, టెక్నాలజీ అనుసంధానత, బ్రాండ్ ప్రమియమైజేషన్పై తాము చేసిన వ్యూహాత్మక పెట్టుబడులు ఫలితాన్నిచి్చనట్టు తెలిపింది. వినియోగంలో స్తబ్దత ఉన్నప్పటికీ తాము మెరుగైన పనితీరు చూపించినట్టు బాటా ఇండియా ఎండీ, సీఈవో గుంజన్ షా పేర్కొన్నారు. సెపె్టంబర్ చివరికి దేశవ్యాప్తంగా బాటా స్టోర్ల సంఖ్య 1,955కి చేరింది. పవర్ బ్రాండ్‌కు సంబంధించి 4, హష్ పప్పీస్కు సంబంధించి 136 బ్రాండెడ్ అవుట్లెట్లు, ఫ్లోట్జ్కు సంబంధించి 14కియోస్క్‌లను కొత్తగా తెరిచినట్టు బాటా ఇండియా తెలిపింది. -
దేశంలో పలు కంపెనీల సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో కల్యాణ్ జ్యువెలర్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 54 శాతం జంప్‌చేసి రూ. 106 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 69 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధితో రూ. 3,476 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 2,889 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ కాలంలో దక్షిణాది మినహా ఇతర మార్కెట్లలో కొత్తగా ఐదు షోరూములను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. వెరసి సెప్టెంబర్‌కల్లా మధ్యప్రాచ్యంతో కలిపి మొత్తం స్టోర్ల సంఖ్య 163కు చేరినట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో కల్యాణ్ జ్యువెలర్స్ షేరు ఎన్ఎస్ఈలో 4 శాతం పతనమై రూ. 103 వద్ద ముగిసింది. ఎన్‌హెచ్‌పీసీ లాభం ప్లస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో విద్యుత్ రంగ పీఎస్‌యూ ఎన్‌హెచ్‌పీసీ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం దాదాపు 22 శాతం వృద్ధితో రూ. 1,686 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,387 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3,166 కోట్ల నుంచి రూ. 3,529 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో ఎన్‌హెచ్‌పీసీ షేరు ఎన్ఎస్ఈలో 1.5 శాతం క్షీణించి రూ. 43 వద్ద ముగిసింది. ఆయిల్ ఇండియాకు రికార్డు లాభాలు ప్రభుత్వరంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఆయిల్ ఇండియా సెప్టెంబర్ క్వార్టర్‌కు రికార్డు స్థాయి లాభాలను ప్రకటించింది. రూ1,720 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆదాయం రూ.6,671 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.504 కోట్లు, ఆదాయం రూ.3,679 కోట్లుగా ఉండడం గమనార్హం ఓఎన్జీసీ తర్వాత ఆయిల్ ఇండియా దేశీయంగా రెండో అతిపెద్ద చమురు కంపెనీ కావడం గమనార్హం. ఒక్కో బ్యారెల్‌కు సెప్టెంబర్ క్వార్టర్లో రూ.100.59 డాలర్లు ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది బ్యారెల్‌కు 71 డాలర్లుగా ఉండడం గమనార్హం. ఆయిల్ ఉత్పత్తిలోనూ పెద్దగా మార్పులేదు. 0.79 మిలియన్ టన్నులుగా, గ్యాస్ ఉత్పత్తి 0.82 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. ఐషర్ మోటార్స్ లాభం హైజంప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 76 శాతం జంప్‌చేసి రూ. 657 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 373 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,250 కోట్ల నుంచి రూ. 3,519 కోట్లకు ఎగసింది. ద్విచక్ర వాహన విభాగం రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు 65 శాతం వృద్ధితో 2,03,451 యూనిట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేరు బీఎస్ఈలో 0.8 శాతం క్షీణించి రూ. 3,702 వద్ద ముగిసింది. లాభాల్లోకి సుజ్లాన్ ఎనర్జీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో పవన విద్యుత్ రంగ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ 2)లో రూ. 56.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 12.4 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 1,362 కోట్ల నుంచి రూ. 1,443 కోట్లకు బలపడింది. సెప్టెంబర్‌కల్లా 759 మెగావాట్ల ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉన్నట్లు కంపెనీ వైస్‌చైర్మన్ గిరీష్ తంతి పేర్కొన్నారు. 193 మెగావాట్ల కొత్త ఆర్డర్లను జత చేసుకున్నట్లు తెలియజేశారు. రైట్స్ నిధులతో రూ. 583 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు కంపెనీ సీఎఫ్‌వో హిమాన్షు మోడీ తెలియజేశారు. వెరసి నికర రుణ భారం రూ. 2,722 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో సుజ్లాన్ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ. 8.30 వద్ద ముగిసింది. పెట్రోనెట్ డివిడెండ్ రూ. 7 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఇంధన రంగ కంపెనీ పెట్రో నెట్ ఎల్ఎన్జీ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 4 శాతం క్షీణించి రూ. 786 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 818 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం ఒక క్వార్టర్‌కు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 15,986 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 10,813 కోట్ల టర్నోవర్ మాత్రమే నమోదైంది. కంపెనీ బోర్డు వాటాదారు లకు షేరుకి రూ. 7 చొప్పున ప్రత్యేక మధ్యంతర డివిడెండు ప్రకటించింది. ఈ కాలంలో కంపెనీ ప్రధాన టెర్మినల్ దహేజ్ 182 టీబీటీ యూనిట్ల ఎల్ఎన్జీని ప్రాసెస్ చేసింది. గత క్యూ2లో 225 టీబీటీయూ నమోదైంది. ఒడిషాలోని గోపాల్పూర్ పోర్టులో 4 మిలియన్ టన్నుల సామర్థ్యంతో తేలియాడే ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 2,306 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో పెట్రోనెట్ షేరు ఎన్ఎస్ఈలో 1.5 శాతం పుంజుకుని రూ. 212 వద్ద ముగిసింది. బాటా లాభంలో 47% వృద్ధి న్యూఢిల్లీ: బాటా ఇండియా కన్సాలిడేటెడ్ లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 47% పెరిగి రూ. 55 కోట్లుగా నమోదైంది. ఆదాయం 35% వృద్ధితో రూ.830 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.37 కోట్లు, ఆదాయం రూ.614 కోట్లుగా ఉన్నాయి. క్లిష్టమైన నిర్వహణ వాతావరణం, అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ అన్ని వ్యాపార చానల్స్‌లోనూ మెరుగైన పనితీరు చూపించినట్టు బాటా తెలిపింది. తగ్గిన అపోలో లాభం వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం తగ్గి రూ.213 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ రూ.3,723 కోట్ల నుంచి రూ.4,274 కోట్లకు ఎగసింది. క్రితం ముగింపుతో పోలిస్తే అపోలో షేరు ధర బీఎస్ఈలో గురువారం 1.80 శాతం తగ్గి రూ.4,282.25 వద్ద స్థిరపడింది. తగ్గిన నాట్కో లాభం ఔషధ రంగ కంపెనీ నాట్కో ఫార్మా సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12.75 శాతం తగ్గి రూ.56.8 కోట్లు సాధించింది. టర్నోవర్ 9 శాతం ఎగసి రూ.452 కోట్లు నమోదు చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రెండవ మధ్యంతర డివిడెండ్ కింద 75 పైసలు చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఎన్ఎస్ఈలో నాట్కో షేరు ధర గురువారం 4.19 శాతం తగ్గి రూ.588.25 వద్ద స్థిరపడింది. ఐఆర్ఎఫ్సీ ఫర్వాలేదు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 14 శాతం పెరిగి రూ.1,714 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.24 శాతం పెరిగి రూ.5,810 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది కాలానికి లాభం రూ.1,501 కోట్లు, ఆదాయం రూ.4,690 కోట్ల చొప్పున ఉన్నాయి. నిర్వహణ ఆస్తులు రూ.4,39,070 కోట్లకు చేరాయి. ఒక్కో షేరుకు రూ.0.80 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. ముత్తూట్ ఫైనాన్స్ లాభం రూ.902 కోట్లు బంగారం, ఇతర రుణాలు అందించే ముత్తూట్ ఫైనాన్స్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.902 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి వచ్చిన లాభం రూ.1,003 కోట్లతో పోలిస్తే 10 శాతం తగ్గింది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో లాభం రూ.825 కోట్లతో పోలిస్తే (సీక్వెన్షియల్‌గా ) 9 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఇక కంపెనీ ఆదాయం సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.2,842 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.3,065 కోట్లతో పోలిస్తే తగ్గింది. ముఖ్యంగా వడ్డీ ఆదాయం 8.2 శాతం తగ్గి రూ.2,758 కోట్లకు పరిమితం కావడం లాభాల క్షీణతకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 4,641 శాఖలు ఉన్నాయి. తన దగ్గర రుణగ్రహీతలు తనఖాగా ఉంచిన 177 టన్నుల బంగారం ఆభరణాల్లో 65 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే ఉన్నట్టు ముత్తూట్ ఫైనాన్స్ తెలిపింది. వ్యక్తిగత రుణాలు, నగదు బదిలీ సేవలను కూడా ముత్తూట్ ఆఫర్ చేస్తుంటుంది. -
బాటా ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు
సాక్షి, ముంబై: పాదరక్షల తయారీ కంపెనీ బాటా ఇండియాకు కొత్త ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నియమితులయ్యారు. యువతలో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న నటుడిని ప్రచారకర్తగా ఎన్నుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని కంపెనీ తెలిపింది. టెలివిజన్, డిజిటల్‌తో పాటు ఇతర మాధ్యమాల ప్రకటనల ద్వారా కార్తీక్ కంపెనీ నాణ్యమైన, సరికొత్త ఉత్పత్తుల గురించి ప్రచారం చేస్తారని వివరించింది. తమ పోర్ట్‌ఫోలియోను మరింత ఆకర్షణీయంగా మార్చడం ద్వారా బ్రాండ్‌ను మారుస్తున్నామని బాటా ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్-మార్కెటింగ్ ఆనంద్ నారంగ్ చెప్పారు. కార్తీక్ ఆర్యన్ లాంటి పాజిటివ్ ఎనర్జీ, ఈజీగోయింగ్ అప్రోజ్ యూత్‌ను ఆకట్టుకుంటుందని, కార్తీక్‌తో అనుబంధం ద్వారా యువతతో తమ సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తోడ్పడుతుందన్నారు. ముఖ్యంగా బాటా రెడ్ లేబుల్, నార్త్ స్టార్, పవర్ హుష్ పప్పీస్ లాంటి యువబ్రాండ్లను తెరపైకి తీసుకు రావడానికి సహాయపడుతుందని ఆయన చెప్పారు. -
మనోడి బా'వు'టా!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. తాజాగా పాదరక్షల సంస్థ బాటాకు గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా భారత సంతతికి చెందిన సందీప్ కటారియా నియమితులయ్యారు. బాటా ఇండియా సీఈవో హోదా నుంచి గ్లోబల్ సీఈవోగా ఆయన ప్రమోట్ అయ్యారు. ఆయన సారథ్యంలో బాటా భారత విభాగం నిలకడగా వృద్ధి, లాభాలు నమోదు చేసింది. ఆదాయాల వృద్ధి రెండంకెల స్థాయిలో ఉండగా, లాభాలు రెట్టింపయ్యాయి. యువ కస్టమర్లకు మరింత చేరువయ్యేలా బాటా ఇమేజీని సరికొత్తగా తీర్చిదిద్దడంలో కటారియా కీలకపాత్ర పోషించారు. తాజా పరిణామంతో ఎఫ్ఎంసీజీ మొదలుకుని ఐటీ సంస్థల దాకా పలు అంతర్జాతీయ దిగ్గజాలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల జాబితాలో కటారియా కూడా చేరారు. అన్ని రంగాల్లో మనోళ్లే.. ఎఫ్ఎంసీజీ మొదలుకుని ఐటీ రంగం దాకా.. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల సంస్థలకు పలువురు భారతీయులు నేతృత్వం వహిస్తున్నారు. ఇండయాస్పోరా అనే సంస్థ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం భారత సంతతికి చెందిన 58 ఎగ్జిక్యూటివ్‌ల సారథ్యంలోని వివిధ కంపెనీల్లో 36 లక్షల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. వీటి ఆదాయం లక్ష కోట్ల డాలర్లు, మార్కెట్ విలువ 4 లక్షల కోట్ల డాలర్ల పైగా ఉంది. అమెరికా, కెనడా, సింగపూర్ సహా 11 దేశాల్లో ఈ సంస్థలు ఉన్నాయి. వివిధ రకాల ఉద్యోగుల బృందాలను సమర్ధంగా నడిపించడంతో పాటు సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలగడం వంటి సామర్థ్యాలు భారత సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్‌లకు సానుకూలాంశాలని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 126 ఏళ్లచరిత్ర.. స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బాటా సంస్థ 1894లో ఏర్పాటైంది. అయిదు ఖండాల్లో 22 సొంత తయారీ కేంద్రాలు ఉన్నాయి. 70 పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 35,000 పైచిలుకు సిబ్బంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 5,800 స్టోర్స్‌లో ఏటా 18 కోట్ల జతల పాదరక్షలను విక్రయిస్తోంది. భారత్‌లో ఏటా సుమారు 5 కోట్ల జతల పాదరక్షలు విక్రయిస్తోంది. శతాబ్దం పైగా చరిత్ర గల బాటా షూ ఆర్గనైజేషన్‌కు ఒక భారతీయుడు సీఈవోగా నియమితుడవడం ఇదే ప్రథమం. దాదాపు అయిదేళ్ల పైగా సీఈవో స్థానంలో కొనసాగిన అలెక్సిస్ నాసార్డ్ స్థానంలో సందీప్ కటారియా నియమితులయ్యారు. -
126 ఏళ్ల బాటా చరిత్రలో తొలిసారి..
ముంబై, సాక్షి: ఫుట్‌వేర్ దిగ్గజం బాటా గ్రూప్ గ్లోబల్ సీఈవోగా తొలిసారి ఒక భారతీయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం బాటా ఇండియా సీఈవోగా వ్యవహరిస్తున్న సందీప్ కటారియా ఇందుకు ఎంపికయ్యారు. ఐదేళ్లపాటు బాటా గ్రూప్‌నకు సేవలందించిన చీఫ్ అలెగ్జిస్ నసార్డ్ నుంచి బాటా గ్లోబల్ పగ్గాలను సందీప్ అందుకోనున్నారు. తద్వారా 126 ఏళ్ల చరిత్ర కలిగిన బాటా గ్రూప్‌ను నడిపించనున్న తొలి భారత సీఈవోగా నిలవనున్నారు. వెరసి దిగ్గజ కంపెనీలకు నేతృత్వం వహిస్తున్న సుప్రసిద్ధ దేశీ సీఈవోల సరసన సందీప్ చోటు సాధించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు సత్య నాదెళ్ల, ఇంటర్నెట్ దిగ్గజం అల్ఫాబెట్‌కు సుందర్ పిచాయ్, మాస్టర్‌కార్డ్‌కు అజయ్ బంగా, ఐబీఎంకు అరవింద్ కృష్ణ, ఎఫ్ఎంసీజీ కంపెనీ రెకిట్ బెంకిసర్‌కు లక్ష్మణ్ నారాయణ్, నోవర్తిస్కు వసంత్ నారాయణ్ సేవలు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావించారు. బ్యాక్‌గ్రౌండ్ బాటా గ్లోబల్‌కు సీఈవోగా ఎంపికైన 49ఏళ్ల సందీప్ ఐఐటీ ఢిల్లీ నుంచి ఇంజనీరింగ్‌లో పట్టభద్రులయ్యారు. 1993 పీజీడీబీఎం బ్యాచ్‌లో గోల్డ్‌మెడలిస్ట్‌గా నిలిచారు. ఎఫ్ఎంసీజీ దిగ్గజం యూనిలీవర్, యుమ్ బ్రాండ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్, టేకో బెల్, వొడాఫోన్ కంపెనీలలో 24 ఏళ్లపాటు పనిచేసిన సందీప్ దేశీ యూనిట్ బాటా ఇండియాకు 2017లో సీఈవోగా చేరారు. స్విట్జర్లాండ్ కేంద్రంగా ప్రపంచవ్యాప్త కార్యకలాపాలు కలిగిన బాటా గ్లోబల్‌కు దేశీ మార్కెట్ అత్యంత కీలకంగా నిలుస్తోంది. సందీప్ నేతృత్వంలో బాటా ఇండియా అమ్మకాలు రెండంకెల్లో వృద్ధి చూపగా.. నికర లాభాలు రెట్టింపయ్యాయి. యువతపై దృష్టిపెట్టడం, బ్రాండ్లకు మరింత ప్రాచుర్యం కల్పించడం వంటి కార్యక్రమాల ద్వారా అమ్మకాలు పెంచుతూ వచ్చారు. గతేడాది బాటా ఇండియా అమ్మకాలు రూ. 3,053 కోట్లకు చేరగా.. నికర లాభం రూ. 327 కోట్లను తాకింది. గత కొన్నేళ్లుగా తీవ్ర పోటీలోనూ బాటా ఇండియా అత్యున్నత ఫలితాలను సాధించినట్లు కంపెనీ చైర్మన్ అశ్వని విండ్లేస్ పేర్కొన్నారు. సందీప్ కార్యాచరణలో బాటా గ్రూప్, బాటా ఇండియా ప్రస్తావించదగ్గ స్థాయిలో లాభపడినట్లు తెలియజేశారు. 1934లో దేశీయంగా ఏర్పాటైన బాటా ఇండియా(బాటా షూ కంపెనీ) మధ్యతరగతి ప్రజల జీవనంలో భాగమైన బ్రాండుగా గుర్తింపును పొందినట్లు విశ్లేషకులు వ్యాఖ్యానించారు. బాటా గ్రూప్ 1894లో టొమస్ బాటా అధ్యక్షతన స్విట్జర్లాండ్‌లో ఆవిర్భవించిన బాటా గ్రూప్ అమ్మకాల పరిమాణంరీత్యా ప్రపంచంలోని టాప్ కంపెనీగా నిలుస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. వార్షికంగా 5,800 స్టోర్ల ద్వారా 18 కోట్ల బూట్ల జతలను విక్రయిస్తోంది. ఐదు ఖండాలలో 22 సొంత తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకుంది. 35,000 మందికిపైగా సిబ్బందిని కలిగి ఉంది. -
900 ఏళ్ల క్రితమే అవి ఉన్నాయి..!
న్యూఢిల్లీ : సోషల్ మీడియా విస్తృతి పెరడంతో సమాచార మార్పిడి వేగంగా జరుగుతోంది. ఏదైనా వింత, విశేషం, స్ఫూర్తిమంతమైన కథలకు ట్విటర్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా తమిళనాడుకు చెందిన వి.గోపాలన్ అనే వ్యక్తి చేసిన ఓ పోస్టు ఆసక్తిగొలిపేదిగా ఉంది. దాదాపు 900 ఏళ్ల క్రితమే ప్రాచీన పురుషులు నేటి బాటా చెప్పులని పోలిన పాదరక్షలు వాడారని ఆయన ట్విటర్ ఓ శిల్పం ఫొటో షేర్ చేశాడు. అది తమిళనాడులోని అవుదయార్‌కోయిల్ ఆలయంలోనిదని ఆయన పేర్కొన్నాడు. ‘మన ప్రాచీనులు చాలా ఫ్యాషనబుల్. ఎన్నో వందల ఏళ్ల క్రితమే వారు శాండల్స్ ధరించారు. అవి ఎలా ఉన్నాయంటే.. బాటా పాదరక్షలను పోలి ఉన్నాయి. కావాలంటే ఫొటోను జూమ్ చేసి చూడండి’ అని క్యాప్షన్ పెట్టాడు. కాగా, గోపాలన్ ట్వీట్‌పై స్పందించిన ఓ యూజర్.. ‘ప్రాచీన కాలంలో.. దాదాపు 1400 ఏళ్ల క్రితం స్త్రీలు కూడా హీల్స్ వేసుకునేవారు. కంచిలోని కైలాసనాథర్ ఆలయంలోని ఈ శిల్పం ఫొటో చూడండి’ అని పేర్కొన్నాడు. వందల ఏళ్ల క్రితమే మహిళలు హై హీల్స్ వేసుకునేవారని మరో యూజర్ శాండల్స్ ధరించి ఉన్న శిల్పం ఫొటో షేర్ చేశాడు. ఇక అవుదయార్‌కోయిల్ ఆలయం 900 ఏళ్ల చరిత్ర కలిగి ఉందని ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు గోపాలన్ సమాధనమిచ్చాడు. రోమ్‌నగరం, ఏథెన్స్ నగరాలు ఉనికిలోకి రాకమునుపే మన కాశీ నగరం బాగా అభివృద్ధి చెందిందని మరొక యూజర్ రాసుకొచ్చారు. Ancient Indian men were very fashionable centuries back! They were wearing sandals thousand years back - the same model which BATA INDIA sells today! Zoom in to the pictures to see the similarity! Avudayar Koil, TN #IndianHeritage pic.twitter.com/gPeDoXOor7 — V Gopalan (@TheGopalan) January 4, 2020 -
బాటాకు రూ.9 వేల జరిమానా
చంఢీగడ్: వినియోగదారుడి వద్ద 3 రూపాయల పేపర్ బ్యాగ్‌కు చార్జి చేసినందుకు గానూ బాటా ఇండియా కంపెనీకి చండీగఢ్ కన్సూమర్ ఫోరమ్ రూ.9 వేల జరిమానా విధించింది. చంఢీగడ్‌కు చెందిన దినేశ్ ప్రసాద్ రాతూరి ఈ ఏడాది ఫిబ్రవరి 5న సెక్టర్ 22డీ ప్రాంతంలోని బాటా షోరూంలో ఒక జత బూట్లు కొన్నారు. దానికి గానూ పేపర్ బ్యాగ్‌తో కలిపి బాటా స్టోర్, వినియోగదారుడి వద్ద రూ.402 చార్జి చేశారు. ఉచితంగా ఇవ్వాల్సిన బ్యాగ్‌కు ఎందుకు చార్జి చేశారని ప్రసాద్ స్టోర్ వారిని ప్రశ్నించారు. బాటా స్టోర్ నిర్వాహకులు ఇచ్చిన సమాధానంతో దినేష్ ప్రసాద్ సంతృప్తి చెందలేదు. దీంతో దినేష్ ప్రసాద్ కన్స్యూమర్ ఫోరం ఆశ్రయించాడు. పేపర్ బ్యాగ్‌పై బాటా బ్రాండ్ ముద్రించి ఉందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఫోరం ముందు తన ఆవేదనను వెళ్లగక్కాడు. తనకు రూ.3 రిఫండ్ చేయించాలని, అలాగే కలిగిన అసౌకర్యానికి పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ఫోరం దాదాపు రెండున్నర నెలల తర్వాత వినియోగదారుడికి అనుకూలంగా తీర్పిచ్చింది. వినియోగదారుడు చేసిన ఆరోపణలను కౌంటర్ ఇచ్చిన బాటా ఇండియా వ్యాఖ్యల్ని త్రోసిపుచ్చింది. వస్తువులను కొన్న వినియోగదారుడికి ఉచితంగా పేపర్ బ్యాగ్ అందించాల్సిన బాధ్యత బాటా స్టోర్‌దేనని ఫోరం తెలిపింది. అలాగే వస్తువులను కొనే వినియోగదారులకు ఉచితంగా బ్యాగ్‌లను అందించాలని ఆదేశించారు. ప్లాస్టిక్ బ్యాగ్‌లతో పర్యావరణానికి ఇబ్బంది కలిగితే బాటా ఇండియానే పర్యావరణానికి అనుకూలంగా ఉండే పేపర్ బ్యాగ్‌లను వినియోగదారులకు అందించాలని సూచించింది. పేపర్ బ్యాగ్ ధర రూ.3, లిటిగేషన్ చార్జి కింద రూ.1000, అలాగే వినియోగదారుడిని మానసికంగా వేదనకు గురిచేసినందుకు గానూ రూ.3 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే స్టేట్ కన్స్యూమర్ డిస్పూట్స్ రిడ్రెస్సల్ కమిషన్ లీగల్ ఎయిడ్ అకౌంట్లో రూ.5 వేలు జమ చేయాలని ఆదేశించింది. చండీగఢ్ వినియోగదారుల ఫోరమ్ తీసుకున్న నిర్ణయం, పేపర్ బ్యాగ్‌లకు చార్జీలు వసూలు చేసే దుకాణదారులకు కనువిప్పులాంటిది. -
మిలిపిటాస్‌లో ఘనంగా 'తెలుగు వాగ్గేయ వైభవం'
కాలిఫోర్నియా : స్వరవేధిక, బే ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్ణాటక సంగీతకారుడు డా. వైజర్సు బాలసుబ్రహ్మణ్యం సహకారంతో కాలిఫోర్నియాలోని మిలిపిటాస్‌లో జైన్ మందిరంలో 'తెలుగు వాగ్గేయ వైభవం' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నాలుగు గంటలు పాటు సాగిన ఈ కార్యక్రమంలో అమెరికాలోని 10 రాష్ట్రాల నుండి వచ్చిన 40 మంది ప్రవాసాంధ్ర చిన్నారులు సుమారు 25 వాగ్గేయకారుల కీర్తనలను ఆలపించారు. బే ఏరియా తెలుగు అసొసియేషన్, స్వరవేదిక సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమనికి క్యూపర్టినో కౌన్సిల్ సభ్యులు, మాజీ మేయర్. సవితా వైద్యనాధన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వాగ్గేయ కారులపై విశేషమైన పరిశోధనలు చేసిన డా. వైజర్సు రచించిన 'అజ్ఞాత వాగ్గేయకారుల' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా.బాలసుబ్రహ్మణ్యంకి క్యూపర్టినో నగర ప్రశంసా పత్రాన్ని అందజేశారు. బే ఏరియా తెలుగు అసొసియేషన్,'స్వరవేదిక' సంస్ధ సంయుక్తంగా డా. వైజర్సు బాలసుబ్రహ్మణ్యంకి 'వాగ్గేయ వరప్రసాది' బిరుదుని ప్రదానం చేశారు. -
‘బాటా’తో స్మృతి నడక
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో బ్రాండింగ్ అవకాశం దక్కించుకున్న భారత మహిళా క్రికెటర్ల జాబితాలో తాజాగా స్మృతి మంధాన కూడా చేరింది. ఇటీవలే హర్మన్‌ప్రీత్ కౌర్‌తో సియట్ సంస్థ ఒప్పందం చేసుకోగా...ఇప్పుడు ప్రముఖ పాదరక్షల ఉత్పత్తుల సంస్థ ‘బాటా’ స్మృతితో జత కట్టింది. బాటాకు చెందిన స్పోర్ట్స్ బ్రాండ్ ‘పవర్’కు 21 ఏళ్ల స్మృతి ప్రచారం చేస్తుంది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో మం«ధాన సూపర్ సెంచరీతో చెలరేగింది. ‘పవర్’కు ప్రచారకర్తగా వ్యవహరించనుండటం పట్ల స్మృతి సంతోషం వ్యక్తం చేయగా...తమతో స్మృతి కలిసి నడవడం ‘బాటా’ విలువను మరింత పెంచుతుందని ఆ సంస్థ ప్రతినిధి సందీప్ కటారియా అన్నారు. -
ఘనంగా బాటా సంక్రాంతి వేడుకలు
సిలికాన్‌వాలీ, బే ఏరియా ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కోలో సంక్రాంతి వేడుకలు, రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. బే ఏరియా తెలుగు అసోసియేషన్(బాటా) ఆధ్వర్యంలో రోజంతా సాగిన సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకల్లో ఇండో అమెరికన్(ఎఐఎ) బృందం పాలుపంచుకుంది. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన వంటల పోటీలు, ముగ్గుల పోటీలు, చిత్రలేఖనం, చెస్ వంటి వాటిలో నిర్వహించిన పోటీల్లో ఎంతో మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంది. సిలికాన్ వ్యాలీలోని పలువురు ప్రముఖులతో పాటు దాదాపు 1000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సూపర్ చెఫ్ పోటీల్లో పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొంటే చిన్నారులకోసం నిర్వహించిన లిటిల్ చెఫ్ పోటీలకు కూడా మంచి స్పందనే వచ్చింది. సూపర్ చెఫ్ పోటీలకు సతీష్ వేమూరి, వినయ్, ఉమాకాంత్ జడ్జీలుగా వ్యవహరించారు. సంక్రాంతి కార్యక్రమాలు జరిగిన వేదిక కూడా పండుగ వాతావరణాన్ని తలపించేలా అలంకరించారు. ముగ్గులు, గాలిపటాలు, మరోవైపు దేశభక్తిని పెంచేలా అమెరికా, భారత్ దేశాల జెండాలను అలంకరించారు.సాంస్కృతిక కార్యక్రమాల్లో 'పాటల పల్లకి' హైలైట్‌గా నిలిచింది. యువ గాయనీ గాయకులు తమ గాన సౌందర్యాన్ని అందరికీ అందించి ప్రశంసలను అందుకున్నారు. ప్రసాద్ మంగిన ఈ కార్యక్రమాన్ని కో ఆర్డినేట్ చేసి,గాయనీ గాయకులను పరిచయం చేశారు. టాలీవుడ్ సినిమాల్లో హిట్టయిన ఎన్నో గీతాలను ఈ సందర్భంగా పాడారు. 'తెలుగు టైమ్స్', బాటా కలిసి నిర్వహిస్తున్న 'పాఠశాల' విద్యార్థులు తెలుగు పద్యాలను, పాటలను, నాటికలను ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు. చిన్నారులు తెలుగు భాషపై చూపించిన పట్టును అందరూ ప్రశంసించారు. బే ఏరియాలో దాదాపు 5 కేంద్రాల్లో 250 మందికిపైగా చిన్నారులు తెలుగు భాషను నేర్చుకుంటున్నారు. బాటా సలహాదారు విజయ ఆసూరి ప్రధానమైన కార్యక్రమానికి తెరలేపారు. చిన్నారులకు భోగిపళ్ళను పోసేందుకు చిన్నారులను, తల్లితండ్రులను, పెద్దలను స్టేజిపైకి ఆహ్వానించారు. వసుధైక కుటుంబం పేరుతోనిర్వహించిన ఈ?కార్యక్రమంలో పెద్దలంతా పిల్లలపై భోగిపళ్ళను పోశారు. శివ నూపురం స్కూల్ ఆఫ్ కూచిపూడి (సింధు కంది) స్టూడెంట్లు శాస్త్రీయ రూపకాన్ని ప్రదర్శించారు. టాలీవుడ్ డ్యాన్స్‌లను ఏరో డ్యాన్స్గ్రూపు (రంజని మంద), క్రియా డ్యాన్స్ అకాడమి (ఉమ ధన్పాల్), జయ శర్మ, గాయత్రి జోషి, రిథమిక్ స్క్వాడ్ గ్రూపులకు చెందిన వాళ్ళు ఉత్తేజకరమైన డ్యాన్స్‌లతో అందరినీ ఉత్సాహపరిచారు. ఎఐఎ టీమ్ వారురిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని చేసిన ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. డా. రమేష్ కొండ, జీవన్ జుష్టి, రాజ్ భానోత్ స్టేజిపైకి ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి, డిప్యూటీ కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా రోహిత్ సతీష్, అసెంబ్లీ మెంబర్లు యాష్ కల్రా, మార్క్ బెర్మన్, కాన్సెన్ చు, శాన్‌హోసె సిటీ మేయర్శామ్ లిక్కార్డో, ఫ్రీమాంట్ సిటీ మేయర్ లిలి మే, కుపర్టినో సిటీ వైస్ మేయర్ డార్సి పాల్, బుర్లింగమే సిటీ వైస్ మేయర్ మైఖెల్ బ్రౌన్ రిగ్, సరటోగా సిటీ కౌన్సిల్ మెంబర్ రిషి కుమార్, సన్నివాలే సిటీ కౌన్సిల్ మెంబర్రుస్సెల్ మెల్టన్ తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు. అందరూ తమ ప్రసంగంలో అందరికీ సంక్రాంతి, రిపబ్లిక్ డే శుభాకాంక్షలను అందజేశారు. ఈ వేడుకల నిర్వహణకు పలు సంస్థలు తమ సహకారాన్ని అందించాయి. రామకృష్ణ వెనుజియా, ఫైనాన్షియల్లి సావి, రవి ట్యాక్స్ సర్వీసెస్, యు స్మైల్ డెంటల్, లావణ్య దువ్వి (రియల్టర్), మను ఛంగోత్ర (రియల్టర్), స్వాగత్ ఇండియన్ కుజిన్, కేక్స్ అండ్ బేక్స్ (ఫుడ్ స్పాన్సర్), బిర్యానిజ్, షాలిమార్, వాలీ టెక్ ఫోర్స్ తదితరులు బహుమతులను స్పాన్సర్ చేశారు. వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన బూత్‌లకు మంచి స్పందనే వచ్చింది. మీడియా పార్టనర్లుగా విరిజల్లు రేడియో, దేశీ 1170 ఎఎం, తెలుగు టైమ్స్, టీవీ 9, వి6 టీవీ, టీవీ ఏసియా వ్యవహరించాయి. బాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు శిరీష బత్తుల(ప్రెసిడెంట్), యశ్వంత్ కుదరవల్లి(వైస్ ప్రెసిడెంట్), సుమంత్ పుసులూరి(సెక్రటరీ), హరినాథ్ చికోటి(ట్రెజరర్), శ్రీకర్ బొద్దు(జాయింట్ సెక్రటరీ), స్టీరింగ్ కమిటీ సభ్యులు కళ్యాణ్ కట్టమూరి, రవి తిరువీధుల, కామేష్ మల్ల, కల్చరల్ కమిటీ సభ్యులు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి, లాజిస్టిక్ కమిటీ సభ్యులు నరేష్ గాజుల, అరుణ్ రెడ్డి, ప్రశాంత్ చింత, కొండల్ రావు తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు. బాటా అడ్వయిజరీ బోర్డ్ నాయకులు జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, రమేష్ కొండ, కరుణ్ వెలిగేటి వేడుకలను చక్కగానిర్వహించిన టీమ్‌ను అభినందించారు. బాటా కమిటీ వేడుకల నిర్వహణలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసింది. -
ఆన్లైన్ విక్రయాల కోసం బాటా ప్రత్యేక పోర్ట్‌ఫోలియో
కోల్‌కతా : ప్రముఖ ఫుట్‌వేర్ తయారీ కంపెనీ బాటా కేవలం ఆన్లైన్ విక్రయాల కోసం ఒక ప్రత్యేక పోర్ట్‌ఫోలియోను ఏర్పాటుచేసింది. ఈ పోర్ట్‌ఫోలియోలో వినియోగదారుల కోసం 500 రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచామని కంపెనీ గ్రూప్ ఎండీ (దక్షిణాసియా) ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. కంపెనీ మొత్తం ఆదాయంలో ఆన్లైన్ విక్రయాల వాటా భవిష్యత్తులో 5 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 40 లక్షలుగా ఉన్న కస్టమర్ల సంఖ్యను 2 కోట్లకు తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు ప్రారంభించామని తెలిపారు.