![Bata India Reports 53percent Increase in Q2 Profit to Rs 52 Crore](/styles/webp/s3/article_images/2024/11/5/BATA-INDIA.jpg.webp?itok=b3td0ost)
లాభంలో 53 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: బాటా ఇండియా సెపె్టంబర్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. లాభం 53 శాతానికి పైగా పెరిగి రూ.52 కోట్లకు చేరింది. ఆదాయం మాత్రం 2 శాతానికి పైగా వృద్ధితో రూ.837 కోట్లుగా నమోదైంది. ఎబిట్డా లాభం స్థిరంగా ఉండడం నిర్వహణ సామర్థ్యాల బలాన్ని తెలియజేస్తున్నట్టు బాటా ఇండియా ప్రకటించింది.
ఉత్పత్తుల ఆవిష్కరణ, కస్టమర్లకు మెరుగైన అనుభవం, టెక్నాలజీ అనుసంధానత, బ్రాండ్ ప్రమియమైజేషన్‌పై తాము చేసిన వ్యూహాత్మక పెట్టుబడులు ఫలితాన్నిచి్చనట్టు తెలిపింది. వినియోగంలో స్తబ్దత ఉన్నప్పటికీ తాము మెరుగైన పనితీరు చూపించినట్టు బాటా ఇండియా ఎండీ, సీఈవో గుంజన్ షా పేర్కొన్నారు. సెపె్టంబర్ చివరికి దేశవ్యాప్తంగా బాటా స్టోర్ల సంఖ్య 1,955కి చేరింది. పవర్ బ్రాండ్‌కు సంబంధించి 4, హష్ పప్పీస్‌కు సంబంధించి 136 బ్రాండెడ్ అవుట్‌లెట్లు, ఫ్లోట్జ్‌కు సంబంధించి 14కియోస్క్‌లను కొత్తగా తెరిచినట్టు బాటా ఇండియా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment