స్మృతి మంధాన
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో బ్రాండింగ్ అవకాశం దక్కించుకున్న భారత మహిళా క్రికెటర్ల జాబితాలో తాజాగా స్మృతి మంధాన కూడా చేరింది. ఇటీవలే హర్మన్‌ప్రీత్ కౌర్‌తో సియట్ సంస్థ ఒప్పందం చేసుకోగా...ఇప్పుడు ప్రముఖ పాదరక్షల ఉత్పత్తుల సంస్థ ‘బాటా’ స్మృతితో జత కట్టింది. బాటాకు చెందిన స్పోర్ట్స్ బ్రాండ్ ‘పవర్’కు 21 ఏళ్ల స్మృతి ప్రచారం చేస్తుంది.
బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో మం«ధాన సూపర్ సెంచరీతో చెలరేగింది. ‘పవర్’కు ప్రచారకర్తగా వ్యవహరించనుండటం పట్ల స్మృతి సంతోషం వ్యక్తం చేయగా...తమతో స్మృతి కలిసి నడవడం ‘బాటా’ విలువను మరింత పెంచుతుందని ఆ సంస్థ ప్రతినిధి సందీప్ కటారియా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment