మిలిపిటాస్‌లో ఘనంగా 'తెలుగు వాగ్గేయ వైభవం' | Swaravedika BATA conducts Telugu vaggeya vybhabam in California | Sakshi
Sakshi News home page

మిలిపిటాస్‌లో ఘనంగా 'తెలుగు వాగ్గేయ వైభవం'

Published Wed, Aug 1 2018 9:06 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

Swaravedika BATA conducts Telugu vaggeya vybhabam in California - Sakshi

కాలిఫోర్నియా : స్వరవేధిక, బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కర్ణాటక సంగీతకారుడు డా. వైజర్సు బాలసుబ్రహ్మణ్యం సహకారంతో కాలిఫోర్నియాలోని మిలిపిటాస్‌లో జైన్‌ మందిరంలో 'తెలుగు వాగ్గేయ
వైభవం' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నాలుగు గంటలు పాటు సాగిన ఈ కార్యక్రమంలో అమెరికాలోని 10 రాష్ట్రాల నుండి వచ్చిన  40 మంది ప్రవాసాంధ్ర చిన్నారులు సుమారు 25 వాగ్గేయకారుల కీర్తనలను ఆలపించారు.

బే ఏరియా తెలుగు అసొసియేషన్, స్వరవేదిక సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమనికి క్యూపర్టినో కౌన్సిల్ సభ్యులు, మాజీ మేయర్. సవితా వైద్యనాధన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వాగ్గేయ కారులపై విశేషమైన పరిశోధనలు చేసిన డా. వైజర్సు రచించిన 'అజ్ఞాత వాగ్గేయకారుల' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా.బాలసుబ్రహ్మణ్యంకి క్యూపర్టినో నగర ప్రశంసా పత్రాన్ని అందజేశారు. బే ఏరియా తెలుగు అసొసియేషన్,'స్వరవేదిక' సంస్ధ సంయుక్తంగా డా. వైజర్సు బాలసుబ్రహ్మణ్యంకి 'వాగ్గేయ వరప్రసాది' బిరుదుని ప్రదానం చేశారు.







 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement