నాకు రెండు సార్లు బర్త్‌ డే విష్‌ చెప్పండి: కార్తీక్‌ ఆర్యన్‌ | Kartik Aryan Wants To Wish Him Twice On His Birth Day | Sakshi
Sakshi News home page

Kartik Aryan: నాకు రెండు సార్లు బర్త్‌ డే విష్‌ చెప్పండి: కార్తీక్‌ ఆర్యన్‌

Published Mon, Nov 22 2021 4:57 PM | Last Updated on Mon, Nov 22 2021 4:57 PM

Kartik Aryan Wants To Wish Him Twice On His Birth Day - Sakshi

Kartik Aryan Wants To Wish Him Twice On His Birth Day: నవంబర్‌ 22న బాలీవుడ్‌ హీరో కార్తీక్ ఆర్యన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడికి డబుల్‌ సెలబ్రేషన్స్‌ దక్కాయి. హీరో తాజా చిత్రం 'ధమాకా' నవంబర్‌ 19న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమా అభిమానులు, ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. అందుకే అతని బర్త్‌డే కేక్‌పై కూడా 'ధమాకా బాయ్' అని రాసి సెలబ్రేట్‌ చేశారు. కార్తీక్‌ తన బర్త్‌డే కేక్‌ను పోస్ట్‌ చేస్తూ 'మళ్లీ పుట్టిన రోజు వచ్చింది.  చాలా సంతోషంగా ఉంది. నాకు రెండు సార్లు శుభాకాంక్షలు చెప్పండి'. అంటూ నవ్వుతూ క్యాప్షన్‌ ఇచ్చాడు. 

బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి కార్తీక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 'పుట్టినరోజు శుభాకాంక్షలు కార్తీక్‌. మీకు ఎప్పుడూ ప్రేమ, సుఖశాంతులు కలగాలని కోరుకుంటున్నా' అని అనుష్క శర్మ విష్‌ చేశారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ కూడా కార్తీక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక్‌ను శిల్పా శెట్టి ధమాకా అని పిలుస్తూ 'నీలో ధమాక వంటి ప్రతిభ ఉంది. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు' అని ఇన్‌స్టా  గ్రామ్‌లో స్టోరీ పెట‍్టారు. 

ఈ హీరోకు అభిమానుల ఫాలోయింగ్‌ భారీగానే ఉంది. బాలీవుడ్‌లో తనదైన సముచితమైన స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కార‍్తీక్‌ తనను తాను ఫ్యాన్ మేడ్ హీరోగా అభివర్ణించాడు. 'నేను అదృష్టవంతున్ని. నేను పూర్తిగా ఫ్యాన్‌ మేడ్‌ హీరోని. నా అభిమానులు, ప్రేక్షకుల వల్లే నేను ఇక్కడ ఉన్నాను. నా అభిమానులు నాలో కొంత భాగంగా భావిస్తున్నాను. నా ప్రయాణంలో వారు కూడా భాగమే. వారు నాకు చాలా ప్రేమ ఇచ్చారు. అది వారికి ఎలా తిరిగి ఇవ్వాలో తెలియదు. నేను వారిని నిరాశపర్చకుండా సాధ్యమైనంత వరకూ పనిచేయడానికి ప్రయత్నిస్తాను. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయను.' అని తెలిపాడు. 'ధమాకా' చిత్రాన్ని కరోనా కారణంగా ముంబైలో రికార్డు స్థాయిలో కేవలం 10 రోజుల్లోనే చిత్రీకరించారు. ఈ సినిమాలో కార్తీక్‌ ఆర్యన్‌తో పాటు మృణాల్‌ ఠాకూర్‌, అమృతా సుభాష్‌, వికాస్‌ కుమార్, విశ్వజీత్‌ ప్రధాన్‌ నటించారు.
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement