ఇటీవలే వరుస సినిమాలతో దూసుకెళ్లన్న బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్. తాజాగా 'సత్య ప్రేమ్ కీ కథ' అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ జంటగా నటించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ యంగ్ హీరోకు సంబంధించి బీ టౌన్‌లో ఓ వార్త తెగ వైరలవుతోంది.
(ఇది చదవండి: తప్పును అంగీకరిస్తున్నా.. దయచేసి క్షమించండి: ఆదిపురుష్ రైటర్)
కార్తీక్ ఆర్యన్ తాజాగా ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతం జుహులో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఈ విలాసవంతమైన ఫ్లాట్ విలువ దాదాపు రూ. 17.50 కోట్లతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆస్తిని జూన్ 30వ తేదీన కొ నుగోలు చేసినట్లు సమాచారం. కార్తీక్ ఆర్యన్ తన తల్లి మాలా తివారీ ఈ ఫ్లాట్ కొనుగోలుకు డీల్ కుదిర్చారు. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి కార్తీక్ ఆర్యన్ నెలకు రూ.7.5 లక్షలు చెల్లిస్తూ షాహిద్ కపూర్ ఇంటిలో నివసిస్తున్నారు.
కాగా.. ప్యార్ కా పంచ్‌నామా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ ఆర్యన్.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. సత్యజీత్ కీ ప్రేమ్ కథ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆర్యన్.. తదుపరి చిత్రం కెప్టెన్ ఇండియాలో నటించనున్నారు.
(ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక)
Comments
Please login to add a commentAdd a comment