
సోషల్ మీడియా వచ్చాక ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చెప్పడం కామన్ అయిపోయింది. జరిగింది ఒకటైతే దాన్ని ఇంకోలా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో సెలబ్రిటీలపై అనేక తప్పుడు కథనాలు వెలువడ్డాయి. అలా ఒకసారి యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ గురించి ఓ వార్త వైరల్ అయింది.ఈ హీరో తన అభిమానిని పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావించాడు కార్తీక్.
'ఒకసారి ఏం జరిగిందంటే నా సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో లేడీ ఫ్యాన్ ఒకరు నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. అంతే, ఆ మాత్రానికే ఏకంగా నేను ఆమెను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు రాశారు. అది చూసి నేను బిగ్గరగా నవ్వుకున్నాను. ఏంటి, మీకలా అనిపించిందా? అనుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ యంగ్ హీరోను ఆరాధించే అభిమానులు చాలామందే ఉన్నారు. ఈ మధ్యే ఓ అభిమాని కార్తీక్ ఆర్యన్ ముఖాన్ని తన ఛాతీపై పచ్చబొట్టు వేయించుకున్న విషయం తెలిసిందే!
Comments
Please login to add a commentAdd a comment