యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఈ మధ్యే ఓ కారు కొన్నాడు. రూ.6 కోట్లు పెట్టి రేంజ్ రోవర్ కారు సొంతం చేసుకున్నాడు. రెండు రోజుల క్రితమే డిక్కీలో పడుకున్న ఓ ఫోటో కూడా పోస్ట్ చేశాడు. కానీ నిన్న మాత్రం ఎంచక్కా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఈమేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన జనాలు.. ఏంటన్నా.. అంత పెద్ద కారు కొని ఇలా చిన్న సైకిల్ మీద తిరుగుతున్నావ్ అని కామెంట్లు చేస్తున్నారు.
రూ.6 కోట్ల కారు కొని సైకిల్‌పై..
అయితే కార్తీక్ మాత్రం.. ఇలా సైకిల్ మీదే సెట్‌కు వెళ్లాలని ఆలోచిస్తున్నానంటున్నాడు. అలాగైతే ఆ ఆరు కోట్ల కారు మాకు ఇచ్చేసేయ్ అని ఓ అభిమాని అడగ్గా.. నా ఫ్రెండ్ ఒకరు కారు కావాలని తీసుకెళ్లాడు. తిరిగిచ్చేయగానే చెబుతానంటూ రిప్లై ఇచ్చాడు. కారు కొన్నాక కూడా ఎందుకని సైకిల్ తొక్కుతున్నావన్న ప్రశ్నకు.. పాత అలవాట్లను మానుకోవడానికి కాస్త టైం పడుతుంది అని చెప్పుకొచ్చాడు.
చేతిలో రెండు సినిమాలు
మొత్తానికి కార్తీక్ సైకిల్ మీద వెళ్తున్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం కబీర్ ఖాన్ డైరెక్షన్‌లో చందు చాంపియన్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే సూపర్ హిట్ హారర్ మూవీ భూల్ భులాయా 2 సినిమా సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఇందులో నేషనల్ క్రష్ లిస్టులో కొత్తగా చేరిన హీరోయిన్ తృప్తి డిమ్రితో పాటు విద్యాబాలన్ ఉన్నారు. ఈ సినిమాకు అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు.
చదవండి: సిగ్గుండాలి అంటూ సందీప్ రెడ్డి వంగాపై విరుచుకుపడిన జావేద్ అక్తర్
Comments
Please login to add a commentAdd a comment