Naga Chaitanya Team Gives Clarity On Telugu Remake Of Bhool Bhulaiyaa 2, Deets Inside - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: ఆ చిత్రం రీమేక్‌లో నాగచైతన్య.. క్లారిటీ ఇచ్చిన టీం!

Published Tue, Jun 6 2023 4:03 PM | Last Updated on Tue, Jun 6 2023 5:05 PM

Naga Chaitanya Team Clarity On Telugu remake of Bhool Bhulaiyaa 2 - Sakshi

అక్కినేని హీరో నాగ చైతన్య ఇటీవలే కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో తమిళ, తెలుగులో ద్విభాషా చిత్రంగా తెరకెక్కించారు. అయితే తాజాగా నెట్టింట్లో ఓవార్త చక్కర్లు కొడుతోంది. 

(ఇది చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన హీరోయిన్.. బేబీ బంప్‌ ఫోటోలు వైరల్!)

ఇటీవల హిందీలో విడుదలైన కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ నటించిన చిత్రం భూల్ భూలయ్యా-2. హిందీలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్నారంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతే కాకుండా ఈ చిత్రంలో టబు పాత్రలో జ్యోతిక కూడా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరలైంది.

(ఇది చదవండి: చిన్న సూట్‌కేసుతో ముంబై వచ్చా.. చేతిలో డబ్బుల్లేక: నటి

తాజాగా ఈ వార్తలపై నాగచైతన్య టీం స్పందించింది. నాగ చైతన్య ఎలాంటి రీమేక్ చిత్రంలో నటించడం లేదంటూ ప్రకటన విడుదల చేసింది. భూల్ ‌భూలయ్య-2 రీమేక్‌పై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దని మీడియాను అభ్యర్థిస్తున్నాం అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. గతంలో అమీర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దాలో నాగ చైతన్య బాలీవుడ్ అరంగేట్రం చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement