ఒకప్పుడు బాలీవుడ్ పేరు చెప్పగానే మెలోడీ పాటలు, హిట్ సినిమాలే గుర్తొచ్చేవి. ఇప్పుడేమో ఘోరమైన ఫ్లాప్ సినిమాలే కనిపిస్తున్నాయి. రోజురోజుకీ హిందీ చిత్రాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఎంతలా అంటే అక్కడి ప్రేక్షకులు.. దక్షిణాది చిత్రాల కోసం ఎదురుచూసేంతలా. ఇప్పుడు అదంతా కాదన్నట్లు ఓ పాట వల్ల కొత్త విమర్శలు వస్తున్నాయి.
బాలీవుడ్ లోని ఇప్పుడున్న యంగ్ హీరోల్లో కార్తిక్ ఆర‍్యన్ ఒకడు. ఇతడు చేసిన సినిమాల్లో కొన్ని రీమేక్స్ ఉన్నాయి. అయినా వన్ ఆఫ్ ది టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇతడి సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్ పలు చిత్రాల్లో నుంచి కాపీ కొట్టి తీసినట్లు అనిపిస్తాయి. ఈ ఏడాది 'షెహజాదా'తో ఘోరమైన ఫ్లాప్ అందుకున్నాడు. ఇది 'అల వైకుంఠపురములో' చిత్రానికి రీమేక్.
(ఇదీ చదవండి: 'కార్తీకదీపం 2'పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్‌బాబు!)
ఇలా పలు మూవీల్ని రీమేక్ చేయడం వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న పాటని కూడా రీమేక్ చేసి పడేశాడు. గతేడాది ఎక్కువమంది యూట్యూబ్ లో వెతికిన వాటిలో పాకిస్థానీ పాట 'పసూరి' అగ్రస్థానంలో నిలిచింది. దీన్నే కార్తిక్ ఆర్యన్ కొత్త సినిమా 'సత్యప్రేమ్ కీ కథ' కోసం వాడేశారు. తాజాగా ఈ గీతాన్ని రిలీజ్ చేయగా నెటిజన్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది.
పాన్ ఇండియా లెవల్లో ప్రస్తుతం దక్షిణాది సినిమాల డామినేషన్ కనిపిస్తోంది. మన దర్శకులు, హీరోలు కొత‍్త సినిమాలతో నార్త్ ఆడియెన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరోవైపు హిందీ హీరోలేమో పరాయి దేశాల పాటల్ని కూడా వదలట్లేదు. నిర్ధాక్షణ్యంగా రీమేక్ చేసి పడేస్తున్నారు. ఇదంతా చూస్తున్న నెటిజన్స్ కి బాలీవుడ్ పై రోజురోజుకీ విరక్తి కలుగుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు!
(ఇదీ చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!)
Comments
Please login to add a commentAdd a comment