సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్, యువనటుడు కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా విపరీతమైన రూమర్లు వినిపిస్తున్నాయి. ‘లవ్ ఆజ్ కల్ 2’లో జోడీ కట్టిన వీళ్లిద్దరి మధ్య కుచ్ కుచ్ హోతా హై అని వస్తున్న వార్తలను సారా గతంలోనే ఖండించారు. అయితే సినిమా ప్రచార కార్యక్రమాల్లో కార్తీక్ సారాని రెండు చేతులతో ఎత్తుకొని స్టేజీపైకి తీసుకొచ్చాడు. దీంతో నెటిజన్లు ఇది కూడా అబద్ధమంటారా అని సెటైర్లు విసిరారు. తాజాగా వీళ్లిద్దరూ మరోసారి ప్రేమికుల్లా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు. కార్తీక్ ఆర్యన్.. సారాకు ఆప్యాయంగా గోరుముద్దలు తినిపిస్తున్నాడు. వీరి ప్రేమానురాగాలను ఫొటోలో బందిస్తూ దాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘నువ్వు చాలా చిక్కిపోయావు. మళ్లీ సాధారణ బరువుకు రావాలి’ అటూ క్యాప్షన్ జోడించాడు. (ఆస్కార్ 2020 : ఉత్తమ నటుడిగా ‘జోకర్’ హీరో)
ఇంకేముంది.. నెటిజన్లు ఊరుకుంటారా. ‘బాలీవుడ్‌లో కొత్త జంట’, ‘ఔను.. వాళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు’ అంటూ వారిని ప్రేమ పక్షులుగా ఫిక్సయిపోతున్నారు. అంతేకాదు, కార్తీక్.. ప్రేయసి కోసం స్వయంగా వంటచేశాడేమోనని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా సారా అలీఖాన్ బాలీవుడ్‌లో అడుగుపెట్టే సమయానికి 96 కిలోల బరువుండేది. కానీ రానురానూ నాజూకు సుందరిగా మారిపోయింది. దీనిపై హీరోయిన్ కరీనా కపూర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘నేను బొద్దుగా ఉండే పాత సారాను మిస్ అవుతున్నాను. ఇప్పుడు నీకెంతో ఇష్టమైన పిజ్జాలు తినడం కూడా మానేసావు కదా’ అని అడిగింది. దీనికి సారా ‘ అవును, కానీ ఇప్పుడు పిజ్జాలు కొనేందుకు అవసరమయ్యే డబ్బు సంపాదిస్తున్నాను. దానికి ఏమంటావు?’ అని సమాధానమిచ్చింది. ఆమె నాజూకుగా మారడం కరీనాకే కాదు, కార్తీక్‌కు కూడా నచ్చలేదని తెలుస్తోంది. ఇక సారా, కార్తీక్ తొలి సారి జోడీ కట్టిన ‘లవ్ ఆజ్ కల్2’ చిత్రం వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. (కార్తీక్‌తో ప్రేమలో ఉన్నా: సారా)
చదవండి: ఈ ఏడాదే రణ్‌బీర్, అలియాల పెళ్లి!?
సారాకు గోరుముద్దలు తినిపించిన హీరో
Published Mon, Feb 10 2020 8:12 PM | Last Updated on Mon, Feb 10 2020 8:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment