బాలీవుడ్ నటి తారా సుతారియా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అపూర్వ అనే చిత్రంతో అభిమానుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో అభిషేక్ బెనర్జీ, ధైర్య కర్వా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇటీవల ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది.
తన ప్రియుడు, నటుడు ఆదార్ జైన్‌తో విడిపోయిందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున రూమర్స్ వైరలయ్యాయి. తాజాగా ఈ విషయాన్ని తారా ధృవీకరించింది. తాను అతనితో రిలేషన్‌లో లేనని పేర్కొంది. కాగా.. మరోవైపు కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాయ్ ఫ్రెండ్‌కు బ్రేకప్ అయినట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది.
తారా మాట్లాడుతూ.. "ఇలాంటివి వింటుంటే చాలా ఉత్సాహంగా ఉంది. నా గురించి ఇలా రాయడం చాలా బాగుంది. నిజ జీవితంలో నేను కూల్‌గా ఉండాలనుకుంటున్నా. అయితే ఈ వ్యక్తులందరితో నేను పనిచేశా. కానీ నాపై వస్తున్న అన్నీ రూమర్సే. ఎలాంటి నిజం లేదు. ఈ పుకార్లలో ఏదీ నిజం కాదు. ఒక్క వారంలోనే నేను ముగ్గురు వేర్వేరు వ్యక్తులను కలిశా. ఈ ప్రపంచంలోనే నాకు మంచి తల్లిదండ్రులు ఉన్నారు. ఇలాంటి విషయాల్లో నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టరు. ఇలాంటివి చదివితే వాళ్లే నా దగ్గరకు వస్తారు. తీరిగ్గా టీ తాగుతూ మాట్లాడుకుంటామని' తెలిపింది. కాగా.. తారా సుతారియా నటించిన అపూర్వ నవంబర్ 15న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment