Manushi Chhillar: మాజీ సీఎం మనవడితో వరుణ్‌ తేజ్‌ హీరోయిన్‌ డేటింగ్‌? | Manushi Chhillar Dating With Veer Pahariya, Rumours Goes Viral | Sakshi
Sakshi News home page

Manushi Chhillar: మాజీ సీఎం మనవడితో వరుణ్‌ తేజ్‌ హీరోయిన్‌ డేటింగ్‌?

Published Wed, Jul 31 2024 12:13 PM | Last Updated on Wed, Jul 31 2024 12:37 PM

Manushi Chhillar Dating With Veer Pahariya, Rumours Goes Viral

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది మానుషి చిల్లర్‌. ఈ సినిమాలో రాడార్ ఆఫీస‌ర్‌ పాత్ర పోషించి..తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడడంతో టాలీవుడ్‌లో ఈ మాజీ విశ్వసుందరి ఆఫర్లు లభించలేదు. దీంతో మళ్లీ తన మకాంను బాలీవుడ్‌కి మార్చింది. అక్కడ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇలా సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది మానుషి. ప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. అయితే ఇన్నాళ్లు ఆమె ఫోటోలు మాత్రమే వైరల్‌ అయ్యేవి. కానీ ఇప్పుడు మానుషి పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించిన ఓ గాసిప్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

ఈ మాజీ విశ్వసుందరీ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే మనవడు, నటుడు వీర్‌ పహారియాతో మానుషి డేటింగ్‌ ఉందని బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దానికి ఓ కారణం ఉంది. ఇటీవల జాన్వీ కపూర్‌, ఆమె ప్రియుడు శిఖర్‌ పహారియా, స్నేహితులతో కలిసి టూర్‌కి వెళ్లింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అందులో మానుషి, శిఖర్‌ సోదరుడు వీర్‌ పహారియా భుజంపై సేదతీరుతూ కనిపించింది. దీంతో మానుషి, వీర్‌లు ప్రేమలో ఉన్నారని, అందుకే కలిసి టూర్‌కి వెళ్లారనే వార్త నెట్టింట చక్కర్లు  కొడుతోంది.అయితే దీనిపై అటు మానుషి కానీ, ఇటు వీర్‌ కానీ స్పందించలేదు.

(చదవండి:  ఈ వారం థియేటర్స్‌లో 11 సినిమాలు..కానీ ఒక్కటి కూడా!)

ఇక మానుషీ విషయానికొస్తే.. హరియాణాకు చెందిన ఈ బ్యూటీ 2017లో విశ్వ సుందరిగా నిలిచింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమానే బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ సరసన నటించే అవకాశం కొట్టేసింది. బాలీవుడ్‌ మూవీ సామ్రాట్‌ పృథ్వీరాజ్‌లో అక్షయ్‌కు జోడీగా నటించింది మానుషీ. ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. రెండో మూవీ ‘ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ’ కూడా ఫ్లాప్‌ అయింది. బాలీవుడ్‌ అచ్చిరాకపోవడంతో టాలీవుడ్‌ మూవీతోనైనా హిట్‌ కొడదామని ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది కూడా ప్లాప్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ జాన్‌ అబ్రహం హీరోగా తెరకెక్కుతోన్న ‘టెహ్రాన్’లో నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement