
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ద్విభాషా(తెలుగు-హిందీ)చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్. మానుషీ చిల్లర్ హీరోయిన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మిస్తున ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘గగనాల తేలాను నీ ప్రేమలోన..’పాట లిరికల్ వీడియోను యూనిట్ రిలీజ్ చేసింది. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరకల్పనలో రామ జోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడారు.
ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ..‘దేశాన్ని కాపాడే సైనికుడు 130 కోట్ల మందిని తన కుటుంబంలా భావించి, తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. అలాంటి సైనికుల కోసం, వాళ్లు చేసిన త్యాగాల కోసం, వాళ్ల కథని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే గొప్ప ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాం.. థియేటర్స్ లో మన దేశానికి రియల్ సూపర్ హీరోస్ అయిన వారి కథని చూసి ప్రేక్షకులంతా చాలా గర్వంగా ఫీలౌతారు’ అన్నారు.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ‘'ఆపరేషన్ వాలెంటైన్' దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల అద్భుతంగా చూపించబోతుంది’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment