మెగా హీరో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటిస్తోన్న చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా మార్చిన 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు వరుణ్. అందులో భాగంగానే మల్లారెడ్డి ఇంజినీరింగ్ ఉమెన్స్ కాలేజీలో సందడి చేశారు. ఈవెంట్‌లో పాల్గొన్న యాంకర్ సుమ అడిగిన పలు ప్రశ్నలకు వరుణ్ ఆసక్తికర సమాధానాలిచ్చారు. అవేంటో తెలుసుకుందాం.
పెళ్లి తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన మార్పులేంటని యాంకర్ సుమ ప్రశ్నించింది. దీనికి వరుణ్ తేజ్ బదులిస్తూ.. 'పెళ్లి తర్వాత ఫోన్‌కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని.. ఎక్కడికి వెళ్తున్నారంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయని.. కానీ అవన్నీ ప్రేమతోనేనని నవ్వుతూ సమాధానమిచ్చారు. అంతే కాకుండా ఈ ఏడాది వాలెంటైన్ డే రోజు లావణ్య ఎలాంటి బహుమతి ఇవ్వలేదన్నారు. ఆ తర్వాత పలువురు విద్యార్థినిలు వరుణ్‌తేజ్‌కు ప్రశ్నలు వేశారు. నా సినిమా స్క్రిప్టు ఎంపికలో పెద్దనాన్న చిరంజీవినే ఆదర్శంగా తీసుకుంటానని ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఆన్సరిచ్చారు. అంతే కాకుండా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
అనంతరం ఆపరేషన్ వాలెంటైన్ గురించి మాట్లాడుతూ.. 'దేశాన్ని రక్షించే మన సైనికుల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వాస్తవ పరిస్థితులను చూపించే అవకాశం అరుదుగా వస్తుంది. ఈ సినిమా కంటే ముందు పుల్వామా ఎటాక్ గురించి నాకు కొంత అవగాహన ఉంది. ముఖ్యంగా యువతకు ఇలాంటి చిత్రాలు చాలా అవసరం. ఇలాంటి సినిమాలో భాగమవడం నా అదృష్టం. సీరియస్ మాత్రమే కాదు.. ఈ చిత్రాన్ని కామెడీ కోణంలోనూ తెరకెక్కించాం. ఇలాంటి తరహాలో చాలా సినిమాలు వచ్చాయి కదా అని అడిగారు. ప్రేమకథా చిత్రాలు, కమర్షియల్ సినిమాలు ఎన్నైనా తీస్తున్నప్పుడు రియల్ హీరోపై ఎందుకు తీయకూడదని అడిగా. ఈ సినిమా నాకెన్నో జ్ఞాపకాలు ఇచ్చింది. ఈ సినిమా పాటను వాఘా బోర్డర్‌లో విడుదల చేయడం ఆనందాన్నిచ్చింది. ప్రతి ఒక్కరు వాఘా బోర్డర్‌ను సందర్శించండి. ఎందుకంటే యువతకు దేశభక్తి చాలా ముఖ్యం. బీఎస్‌ఎఫ్ జవాన్లను కలుసుకోవడం నాకు మంచి అనుభూతినిచ్చింది' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment