నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రిటర్న్స్
రామ్‌గారూ.. నేను బి.టెక్ సెంకడ్ ఇయర్ చదువుతున్నాను. మా కాలనీలో ఒకతను అయిదు నెలలుగా నన్ను ఫాలో అవుతున్నాడు. నేను కాలేజ్‌కి వెళ్లేటప్పుడు నా వెనకే వస్తాడు. అతను నన్ను ఎందుకు ఫాలో అవుతున్నాడో ఇప్పటికీ అర్థం కాలేదు. అతనిది లవ్వా? ఆకర్షణా? తెలియదు. నాతో మాట్లాడాలని చాలా సార్లు ట్రై చేశాడు. కాని నాకు భయం వేసి మాట్లాడకుండా వెళ్లిపోయాను. అతని వల్ల నా చదువు దెబ్బతింటోంది. నాకు నా కెరీర్ ముఖ్యం. ఒక వేళ అతను నన్ను లవ్ చేస్తున్నట్లయితే నేను రిజెక్ట్ చేస్తే అతని కెరీర్ నా వల్ల పాడవుతుందని భయం వేస్తోంది. మీరే ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెప్తారని ఎదురుచూస్తున్నాను.
– ఆనందిత, ఇ–మెయిల్
పొల్యూషన్ అమ్మా... పొల్యూషన్.... ఎక్కడ చూసినా పొల్యూషనే... వీధులంతా పొల్యూషనే... ఎక్కడబోతే అక్కడ పొల్యూషన్ ఫాలో అవుతోంది. ఏం చేయమంటావు చెప్పు. మురికి గుంట పక్క నుంచి వెళ్తుంటే ముక్కు మూసుకుంటాం. షేర్ ఆటోలో హోరెత్తించే పాటలు వినబడుతుంటే చెవులు మూసుకుంటాం. పొగలు కక్కుతున్న లారీ వస్తుంటే కళ్లూ, ముక్కు రెండూ మూసుకుంటాం. ఇన్ని పొల్యూషన్లకీ రియాక్షన్‌గా ఇంద్రియాలను మూసుకుంటున్నాం కదా! నిలువెత్తు పొల్యూషన్ నీ వెనకే వస్తుంటే హృదయం మూసుకోవడం మంచిది! ఏమంటావు... ఆ జింగిరీ కెరీర్ ఏమవుతుందో అని టెన్షన్ పడి నీ కెరీర్‌ని జింగిరీ చేసుకోవడం ఊ... హు... నాట్ ఓకే. మంచితనం అన్నిచోట్లా ప్రదర్శించవద్దు.... జీవితంలో దెబ్బతింటావు.
నువ్వు బంగారంరా... నీకు ఇష్టం లేకపోయినా ఇంకొకరు తప్పు చేస్తున్నా నువ్వు చూపిస్తున్న బాధ్యత చాలా గొప్పది. అపకారికి ఉపకారం నెపమెన్నక చేయునది నా బంగారుకొండ ఆనందిత... కాని నిన్ను ఫాలో అయ్యేవాళ్ళని పట్టించుకునే బదులు, నువ్వు ఫాలో అవ్వాలనుకున్న కెరియర్‌ని పట్టించుకుంటే సంతోషంగా ఉంటావు. పిచ్చితల్లీ... అర్థం చేసుకోరా...! ‘నీలాంబరీ... ఆన్సర్ రాసి అలసిపోయాను. ఒక జింగిరి ఇవ్వు’... అన్నాను. ‘అంతగా అనాలనిపిస్తే నన్ను అనండి. అంతేకాని నా అరటిపండును జింగరీ అనకండి’ అని విసవిసా వెళ్లిపోయింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్
ఈ కింది అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారా హిల్స్,
హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com