అమ్మాయిలూ.. చలో | womens Career special story | Sakshi
Sakshi News home page

అమ్మాయిలూ.. చలో

Published Thu, Apr 12 2018 12:03 AM | Last Updated on Thu, Apr 12 2018 12:03 AM

womens  Career  special story  - Sakshi

ప్రయాణాలు ఎదుగుదలకు తోడ్పతాయి. కెరియర్‌లోనే కాదు, మనిషిగా కూడా ఎదుగుతాం! ఎదిగాక చేయవలసిన ప్రయాణాలు కొన్ని ఉంటాయి. అవి ఎంతో ఆసక్తికరంగా సాగుతాయి. ఆహ్లాదం కలిగిస్తాయి. ఆదర్శవంతంగా ఉంటాయి.పెద్దపెద్ద హోదాల్లోని మహిళలు కొందరుఎప్పుడూ ప్రొఫెషనల్‌ ట్రిప్పుల్లో ఉంటారు.  వాళ్ల ట్రిప్‌ స్టెయిల్‌లో మనకు పనికొచ్చే టిప్స్‌ ఇవి. 

ఫర్జానా హక్‌ (ముంబై)
హెడ్, యూరప్‌ టెలికామ్‌ బిజినెస్‌ యూనిట్‌గ్లోబల్‌ హెడ్, స్ట్రాటెజిక్‌ గ్రూప్‌ అకౌంట్స్, టి.సి.ఎస్‌.టాటా గ్రూప్‌లో ట్రైనీగా చేరి, ఉన్నతస్థాయికి ఎదిగిన ఫర్జానా ఏడాదికి 180 నుంచి 200 రోజులు ప్రయాణాల్లోనే ఉంటారు. ఎక్కువగా ఐరోపా దేశాలకు ప్రొఫెషనల్‌ ట్రిప్‌ కొట్టి వస్తారు. ప్రయాణ సమయంలో పుస్తకాలు చదవడం ఇష్టం. పుస్తకాల్లో ముఖ్యమైన పాయింట్స్‌ ఉంటే ఫ్లయిట్‌లోనే నోట్‌ చేసుకుంటారు. ఫర్జానా దగ్గర తాతగారు కానుకగా ఇచ్చిన ఇంకు పెన్ను  ఉంది. ఇప్పటికీ ఆ పెన్ను వాడుతున్నారు.అమ్మాయిలకిచ్చే సలహా : జర్నీని ఎంజాయ్‌ చెయ్యండి. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి మీ లైఫ్‌లో ప్రాధాన్యం ఇవ్వండి.

అవనీ బియానీ (ముంబై)
కాన్సెప్ట్‌ హెడ్, ఫుడ్‌హాల్‌ ఈ రిటైల్‌ ఫుడ్‌ చెయిన్‌... అసలు బియానీ ఐడియాల వల్లే నడుస్తోంది. నెలలో కొన్నిరోజులైనా ఈమె బిజినెస్‌ ట్రిప్‌ ఉంటారు. ముఖ్యంగా లండన్, న్యూయార్క్, స్విట్జర్లాండ్‌లలో పనులు చక్కబెట్టుకొస్తుంటారు. బీచ్‌ లవర్‌. స్కీయింగ్‌ ఇష్టం. తెల్లవారక ముందే బయల్దేరే విమానాల ప్రయాణం బియానీకి అస్సలు ఇష్టం ఉండదు. కొన్ని మనుషులు, కొత్త ప్రదేశాలు ఆమె నిరంతర ఉల్లాస రహస్యం. ఐప్యాడ్‌ లేకుండా బియానీ అడుగు బయటపెట్టరు. అమ్మాయిలకిచ్చే సలహా : కొత్త రుచులకోసమైనా ప్రయాణాలు చేసి తీరవలసిందే.

ప్రియా పాల్‌ (కోల్‌కతా)
చైర్‌ పర్సన్, ది పార్క్‌ హోటల్స్‌నెలలో కనీసం 10 నుంచి 12 రోజులో విమానాల్లో చక్కర్లు కొడుతుంటారు! నవీ ముంబై, బెంగళూరు, చెన్నై, గోవా, హైదరాబాద్, ప్యారిస్, లండన్‌లలో ఆమెకు పని ఉంటుంది. ఎక్కువగా న్యూయార్క్‌ వెళుతుంటారు. అక్కడి ‘నోమాడ్‌’ లో దిగుతారు. ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ మళ్లీ వెహికిల్స్‌ ఎక్కకుండా.. వీలైనంత వరకు బ్రేక్‌ఫాస్ట్‌కీ, లంచ్‌కీ, డిన్నర్‌కి, ఇంకా.. సైట్‌ సీయింగ్‌లకు నడిచే వెళ్లమని ఆమె సలహా ఇస్తారు.అమ్మాయిలకిచ్చే సలహా : మీరు ఉన్న చోటి నుంచి కొత్తగా ఎక్కడికైనా సరే నాలుగు అడుగులు వేసి రండి.  

గుంజన్‌ సోనీ (బెంగళూరు)
హెడ్, జబాంగ్‌ అండ్‌ సీఎంవో, మింత్రాఫ్యాషన్‌ పోర్టల్‌ హెడ్డుగా ఏడాదికి 200 రోజులు బిజినెస్‌ ట్రిప్పులోనే ఉంటారు. ఢిల్లీ, హాంకాంగ్, సింగపూర్, లండన్, యు.ఎస్‌. ఆమె తరచూ వెళ్లే ప్రదేశాలు. మీటింగ్‌ ఉన్న దేశంలో లేదా సిటీలో ఇరవై నాలుగు గంటల ముందే సోనీ సిద్ధంగా ఉంటారు. ఫ్రెండ్స్‌కి, కుటుంబ సభ్యులకు గుర్తుపెట్టుకుని మరీ గిఫ్టులు కొంటారు.అమ్మాయిలకిచ్చే సలహా : తప్పనిసరిగా ప్రయాణాలు చెయ్యాలి. అందువల్ల మన ప్రపంచం విస్తృతమౌతుంది.

విష్పలరెడ్డి (న్యూఢిల్లీ)
చీఫ్‌ పీపుల్స్‌ ఆఫీసర్, ఊబర్‌ ఇండియా అండ్‌ సౌత్‌ ఏషియాఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు, శాన్‌ఫ్రాన్సిస్‌కోలకు ట్రావెల్‌ చేస్తుంటారు. కొండప్రాంతపు బీచ్‌లను ఇష్టపడతారు. వెళ్లిన చోట పని పూర్తి కాగానే తప్పనిసరిగా అక్కడి ఫ్రెండ్స్‌ని కలుస్తారు. లండన్‌ వెళ్లినప్పుడు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ సమీపంలోని గోరింగ్‌ హోటల్‌లో స్టే చేస్తారు. ఒంటరిగా ప్రయాణం చేయడం ఇష్టం. ఏకాంతం లభిస్తుందట. అమ్మాయిలకిచ్చే సలహా : ఒంటరిగా ప్రయాణించడంలోని స్వేచ్ఛను అనుభూతి చెందండి.

అవనీ దావ్దా  (ముంబై)
మేనేజింగ్‌ డైరెక్టర్, గోద్రెజ్‌ నేచర్స్‌ బాస్కెట్‌ఏడాదిలో 40 రోజులు టూర్‌లోనే ఉంటారు. బెంగళూరు, పుణె, ఢిల్లీ, దుబాయ్, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలకు తిరుగుతుంటారు. ఆహార ఉత్పత్తులను విక్రయిస్తుండే కంపెనీకి ఎం.డీ. అయిన దావ్దాకు లండన్‌ వెళ్లినప్పుడు సెయింట్‌ జేమ్స్‌ కోర్ట్‌లో లంచ్‌గానీ, డిన్నర్‌ గానీ చేయడం ఇష్టం. మాయిశ్చరైజర్, సౌకర్యవంతంగా ఉండే కాలిజోళ్లను దగ్గర ఉంచుకోవడం మర్చిపోరు. టూర్‌లో రూమ్‌ సర్వీస్‌ని అస్సలు ఉపయోగించుకోరు. బయటికి వెళ్లే తిని వస్తారు. అమ్మాయిలకిచ్చే సలహా : ప్రయాణాలు మీ జీవితానికి సహజసిద్ధమైన పౌష్టికాహారాన్ని అందిస్తాయి. 

అపూర్వ పురోహిత్‌ (ముంబై)
ప్రెసిడెంట్, జాగరణ్‌ ప్రకాశన్‌ లిమిటెడ్‌మీడియా పరిశ్రమలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న అపూర్వ ప్రింట్, రేడియో, డిజిటల్‌ కంటెంట్‌ కోసం గత ఐదేళ్లలో దాదాపుగా ప్రతి వారం విదేశీయానంలోనే ఉన్నారు! యు.కె. సింగపూర్, హాంకాంగ్, న్యూఢిల్లీ బెంగళూరు.. ప్రధానంగా ఆమె ప్రయాణ ప్రదేశాలు. ఎప్పుడూ తను వాడే షాంపూ, కండిషన్‌ కూడా ఆమె బ్యాగ్‌లో ఉంటాయి. అమ్మాయిలకిచ్చే సలహా : కెరీర్, కుటుంబం.. ఈ రెండింటి లోనూ సక్సెస్‌ సాధించాలి.

రాధా కపూర్‌ (ముంబై)
ఫౌండర్‌ అండ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, ఐ.ఎస్‌.డి.ఐ.ఐ.ఎస్‌.డి.ఐ. అంటే ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ అండ్‌ ఇన్నోవేషన్‌. ఇక చెప్పేదేముందీ డిజైనింగ్‌ ఒక సృజనాత్మక అన్వేషణ. ప్రపంచమంతా తిరుగుతారు రాధ. ముఖ్యంగా ప్యారిస్, న్యూయార్క్‌ మీటింగులకు. ఫ్లయిట్‌ దిగాక పనుల్లో బిజీ అయిపోతారు కానీ, ఫ్లయిట్‌లో ఉన్నప్పుడు ఏమీ తినరు. ఫ్లయిట్‌ దిగాక పనులు అయ్యాక కానీ తన సొంత పనులు చూసుకోరు. యోగాకి మాత్రం టైమ్‌ అడ్జెస్ట్‌ చేసుకుంటారు. అమ్మాయిలకిచ్చే సలహా : ఎక్కువ తినకండి. స్లిమ్‌గా ఉండండి. ప్రయాణాలు చేస్తూ ఉండండి.

ఉపాసన టాకు (న్యూఢిల్లీ)
కో–ఫౌండర్, మొబీక్విక్‌ ఈ మొబైల్‌ పేమెంట్‌ కంపెనీ సారథి నెలలో కనీసం రెండుసార్లు జర్నీ చేస్తారు. కొన్నిసార్లు తన రెండేళ్ల బిడ్డను కూడా వెంట తీసుకెళతారు. తరచూ సింగపూర్, యు.కె., యు.ఎస్‌. వెళ్లొస్తుంటారు. ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో ఏ సమయంలోనైనా దువ్వెన, చార్జర్, ఎలర్జీ మందులు ఉంటాయి. వెళ్లిన చోట వీలుని బట్టి స్నార్కెలింగ్, హైకింగ్, సైక్లింగ్‌ చేస్తారు. 
అమ్మాయిలకిచ్చే సలహా : మీ సంపాదనలో కొంత భాగాన్ని తప్పనిసరిగా టూర్‌ల కోసం తీసిపెట్టుకోండి.

డాక్టర్‌ హర్ష బిజ్లానీ (ముంబై)
మెడికల్‌ హెడ్, ది ఏజ్‌లెస్‌ క్లినిక్‌ అండ్‌ సెలబ్రిటీ స్కిన్‌ ఎక్స్‌పర్ట్‌ప్రయాణాలు చేయడమే కాదు, ప్రయాణించి వచ్చిన వారికి స్కిన్‌ మళ్లీ ‘గ్లో’అవడానికి సలహాలు ఇస్తుంటారు. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తరచూ నీళ్లు తాగుతుండాలని, క్రమం తప్పకుండా తినాలని చెబుతారు. లాస్‌ ఏంజిల్స్, లండన్, న్యూయార్క్, సింగపూర్‌.. ఇలా అనేక దేశాల్లో కాన్ఫరెన్స్‌లకు వెళ్లొస్తుంటారు బిజ్లానీ. ఏడాదిలో 30 నుంచి 45 రోజులు ఆమెకు టూర్‌లు ఉంటాయి. వెళ్లినచోట కొత్త కొత్త రెస్టారెంట్‌లను కనిపెట్టడం, జిమ్‌కు వెళ్లడం ఆమె అలవాటు. అమ్మాయిలకిచ్చే సలహా : నిరంతరం ప్రయాణిస్తూ ఉండండి. ప్రపంచాన్ని శోధించండి. తెలుసుకునే ఆసక్తి ఉంటే తెలియని వాటి గురించి భయమే ఉండదు.ఇన్‌పుట్స్‌: సిఎన్‌ ట్రావెలర్‌

రాధికా ఘాయ్‌ (న్యూఢిల్లీ)
కో–ఫౌండర్, చీఫ్‌ బిజినెస్‌ స్టాఫ్, షాప్‌క్లూస్‌.కామ్‌  ఏడాదికి 120 రోజులు ప్రయాణాల్లోనే ఉంటారు. ఈ వ్యవధిలో ఆకాశంలో ఆమె ప్రయాణించే దూరం 6 లక్షల 70 వేల మైళ్లు. సింగపూర్‌ ఆమెకు ఇష్టమైన డెస్టినేషన్‌. వెస్టిన్‌లో ఓ కప్పు కాఫీ తాగి, మీటింగ్స్‌ని ముగించుకుని మెరీనా బే శాండ్స్‌లో షాపింగ్‌ చేసి, డెంప్సీహిల్‌లోని ఏ రెస్టారెంట్‌లోనైనా లంచ్, డిన్నర్‌ చేయడం.. సింగపూర్‌లో ఆమెకు ప్రియమైన వ్యాపకాలు. పెద్దగా లగేజ్‌ తీసుకెళ్లరు. ఓ చిన్న సూట్‌కేస్‌లో అన్నీ సర్దేసుకుంటారు. స్నీకర్స్‌ (తేలికపాటి షూజ్‌) తప్పనిసరి. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పుస్తకం చదువుతూ, కునుకుతీస్తారు.  అమ్మాయిలకిచ్చే సలహా : విహరించండి, విందులు ఆరగించండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement